Hyundai: భారతీయుల దెబ్బకి దిగివచ్చిన హ్యుండయ్.. 25 ఏళ్ల బంధాన్ని మరచిపోమంటూ క్షమాపణలు..
Hyundai Controversy Post: కశ్మీర్(Kashmir) విషయంలో పాకిస్తాన్(Pakisthan) కు సపోర్ట్ చేస్తూ.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుండయ్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు..
Hyundai Controversy Post: కశ్మీర్(Kashmir) విషయంలో పాకిస్తాన్(Pakisthan) కు సపోర్ట్ చేస్తూ.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుండయ్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. భారత దేశంలో గత 25 ఏళ్లుగా కార్యకలాపాలను సాగిస్తున్న ఈ కార్ల కంపెనీ భారతీయుల మనోభావాలను పట్టించుకోలేదంటూ భారతీయులు #BoycottHyundai తో ట్రెండ్ చేశారు. దీంతో హ్యుండయ్ దిగి వచ్చింది.. తాజాగా భారతీయులకు క్షమాపణ చెబుతూ ఓ లెటర్ ను రిలీజ్ చేసింది. తాము కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ.. పాకిస్తాన్ కు చెందిన విభాగం చేసిన వ్యాఖ్యలను తాము సమర్ధించమని భారత్ కు చెందిన హ్యుండయ్ విభాగం తెలిపింది. అంతేకాదు భారతీయులు జాతీయవాదాన్ని గౌరవించే తత్వమున్నవారని.. అందుకనే తాము భారతీయుల జాతీయవాదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న పాకిస్తాన్ లో కశ్మీర్ ఏర్పాటు వాదానికి మద్దతినిస్తూ.. సంఘీభావ దినోత్సవాన్ని జరుపుతారు. ఈరోజు దేశప్తంగా ర్యాలీలు నిర్వహించి, అమరులైన పాకిస్తాన్ సైనికులకు నివాళులర్పిస్తారు. అయితే ఈ పాకిస్తాన్ సంఘీభావ దినోత్సవానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు పాక్ ని సపోర్ట్ చేస్తూ.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్ సంస్థ.. పాకిస్తాన్ విభాగం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కశ్మీర్ కోసం త్యాగాలు చేసిన మన సోదరులను స్మరించుకుందాం, స్వేచ్ఛ కాశ్మీర్ కోసం వారికి మద్దతు ఇద్దాం.. అంటూ ట్వీట్ చేసింది.
ఈ పోస్టుకు భారతీయులు మండిపడ్డారు. వెంటనే హ్యుండయ్ కంపెనీకి పాకిస్తాన్ పోస్ట్ విషయంలో ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్ చేసింది త్యాగాలైతే.. మరి ఏళ్లకేళ్లుగా భారతీయులు చేస్తున్నదేమిటి అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ సంస్థ.. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మానేసి.. తమను ప్రశ్నిస్తున్నవారిని బ్లాక్ చేయడం మొదలు పెట్టింది. ఇలా తమ సంస్థకు వ్యతిరేకంగాస ట్వీట్ చేస్తున్నవారిని బ్లాక్ చేయడమే కాదు.. వారిని ట్వీట్లను కూడా డిలీట్ చేసింది.
దీంతో భారతీయులు హ్యుండయ్ కంపెనీ తీరుపై మండిపడ్డారు.. వెంటనే #BoycottHyundai హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసి హ్యుండయ్ సంస్థ గ్లోబల్ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు. అంతేకాదు ఒక నెటిజన్.. తాను హ్యుండయ్ కంపెనీకి చెందిన కారును కొన్నందుకు చాలా సిగ్గుపడుతున్నా అంటూ కామెంట్ చేశాడు.. అంతేకాదు ఇక నుంచి ఎప్పుడూ ఈ కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేయనంటూ స్పష్టం చేశాడు. మరికొందరు నెటిజన్లు.. భారత దేశంలో ఎంత మంది హ్యుండయ్ కార్లను కొంటున్నారు.. పాకిస్తాన్ ఎన్ని.. ఏ ఏ సంవత్సరాల్లో ఎన్ని కార్లు ఇరు దేశాలకు అమ్మకాలు చేశారో లెక్కలు బయటకు తీసి.. లెక్కలను పోస్టు చేస్తూ మరీ సదరు కంపెనీ తీరుపై మండిపడ్డారు.
Hyundai in Pakistan is asking for freedom of Kashmir.
Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu
— Anshul Saxena (@AskAnshul) February 6, 2022
హ్యుండాయ్ కంపెనీ తీరుపై భారతీయులు మండిపడ్డారు.. ఎక్కువమంది నెటిజన్లు.. తాము ఇక నుంచి దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్, కియా కార్లను ఖరీదు చేసే ప్రసక్తే లేదని.. మా దేశం నుంచి ఈ కంపెనీలు వెళ్ళిపొమ్మని కోరుతూ.. సదరు కంపెనీలపై భారతీయులు ఓ రేంజ్ లో దండయాత్ర చేశారు. వరసగా ట్వీట్ల వర్షం కురిపించారు. అప్పటికి జరిగిన నష్టం.. తప్పుని గ్రహించిన హ్యుండయ్ సంస్థ దిగివచ్చి.. భారతీయుల మనోభావాలను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని కోరింది. తాము భారతీయులతో గత 25 ఏళ్లుగా బంధం ఏర్పరచుకున్నామని.. వారిని బాధపెట్టే పనులు ఎప్పుడు చేయలేదని.. ఎవరు చేసినా సహించమంటూ క్షమాపణలు చెప్పింది. వెంటనే పాకిస్తాన్ విభాగం చేసిన ట్వీట్ ను డిలీట్ చేసింది. కార్ల అమ్మకాల్లో హ్యుండాయ్ కంపెనీకి భారతదేశం రెండో అతిపెద్ద మార్కెట్.
Official Statement from Hyundai Motor India Ltd.#Hyundai #HyundaiIndia pic.twitter.com/dDsdFXbaOd
— Hyundai India (@HyundaiIndia) February 6, 2022
Also Read: