IND vs WI: టీమిండియా దెబ్బకు మరింత దిగజారిన వెస్టిండీస్.. జట్టుతో చేరిన చెత్త రికార్డులేంటంటే?

West Indies: అహ్మదాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ మరో 132 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్‌ను ఓడించింది. బంతుల పరంగా వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయంగా నమోదైంది.

IND vs WI: టీమిండియా దెబ్బకు మరింత దిగజారిన వెస్టిండీస్.. జట్టుతో చేరిన చెత్త రికార్డులేంటంటే?
India Vs West Indies
Follow us

|

Updated on: Feb 07, 2022 | 12:45 PM

IND vs WI: భారత్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 177 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా(Indian Cricket Team) 28 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఓటమిలో వెస్టిండీస్‌(West Indies Cricket Team) పేరిట ఎన్నో అవాంఛనీయ రికార్డులు నమోదయ్యాయి. అలాగే వన్డేల్లో ఈ జట్టు ప్రదర్శన మరోసారి కొట్టొచ్చినట్లు కనిపించింది.

మరో 132 బంతులు మిగిలుండగానే పరాజయం.. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ మరో 132 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్‌ను ఓడించింది. బంతుల పరంగా వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయంగా నమోదైంది. అంతకుముందు 2018లో తిరువనంతపురంలో విండీస్ జట్టును 211 బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై కరేబియన్ టీంకు మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది. అంతకుముందు, ఈ జట్టు 1996లో గ్వాలియర్‌లో 173, 2018లో తిరువనంతపురంలో 104గా మారింది.

2018 నుంచి 30.2 సగటుతోనే వెస్టిండీస్ బ్యాటింగ్.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు చాలా కాలంగా వన్డే క్రికెట్‌లో తడబడుతోంది. ఈ జట్టు ఈ ఫార్మాట్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దుకోవడంలో విఫలమైంది. 2018 నుంచి 50 ఓవర్ల క్రికెట్‌లో ఈ జట్టు సాధించిన గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. బ్యాటింగ్ యావరేజ్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018 నుంచి ఇప్పటి వరకు ఈ జట్టు బ్యాటింగ్ సగటు 30.2గా నమోదవుతోంది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ టాప్-6 బ్యాట్స్‌మెన్‌లను త్వరగా తమ వికెట్లను సమర్పించుకుని పెవిలియన్ చేరుతున్నారు. దీంతో టీ20 క్రికెట్‌లో సందడి చేసిన విండీస్ బ్యాట్స్‌మెన్స్.. 50 ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ఈ ఫార్మాట్‌లో రాణించలేక పరాజయాలను స్వీకరిస్తున్నారు.

వన్డేల్లోనూ ఐర్లాండ్‌ ఓడింది.. మరోవైపు ఇటీవల వెస్టిండీస్ జట్టు ఐర్లాండ్ వంటి బలహీనమైన జట్టుతో స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోవలసి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్ టీం వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. బ్యాట్స్‌మెన్స్ ఆటను మెరుగుపరుచుకోవాలని కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఎన్నో సార్లు బాహాటంగానే పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మెరుగుదల కనిపించకపోవడం గమనార్హం.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటైన విధానం షాకింగ్‌గా ఉంది.. ప్రస్తుతం అతను సరిగాలేడు.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

IND vs WI: విరాట్‌ కోహ్లీ రికార్డ్‌ని బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. ఏ విషయంలో తెలుసా..?

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే