Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటైన విధానం షాకింగ్‌గా ఉంది.. ప్రస్తుతం అతను సరిగాలేడు.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రస్తుతం విరాట్ కోహ్లీ(virat kohli) సరిగా లేడని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా(aakash chopra) అభిప్రాయపడ్డారు...

Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటైన విధానం షాకింగ్‌గా ఉంది.. ప్రస్తుతం అతను సరిగాలేడు.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Virat Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 07, 2022 | 10:01 AM

ప్రస్తుతం విరాట్ కోహ్లీ(virat kohli) సరిగా లేడని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా(aakash chopra) అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ 4 బంతులు ఆడి ఔట్ అవ్వడంపై ఆకాష్ మాట్లాడారు. దక్షిణాఫ్రికాలో విరాట్ కోహ్లీ పరుగులు సాధించాడని, అయితే అతని బ్యాటింగ్‌లో విషయం కనిపించలేదని చెప్పాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 4 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 2 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కెమర్ రోచ్(kemar roach) బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్‌ చేతికి చిక్కాడు.

ESPNcricinfoలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, “కోహ్లీ అవుట్ అయిన విధానం చాలా షాకింగ్‌గా ఉంది. నా ప్రకారం అతను కొంచెం హడావిడిగా కనిపించాడు. అయితే, పిచ్ పరిస్థితులను విరాట్ కంటే మెరుగ్గా ఎవరూ చదవలేరు. ఎందుకంటే లేకపోతే ఇన్ని పరుగులు చేసి ఉండేవాడు కాదు. “అతను ఆడిన షాట్‌లు అతని ఇమేజ్‌కి సరిపోలడం లేదు” అని చెప్పాడు.

“కోహ్లీ 4 బంతుల్లో ఔట్ కావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం అతని మనస్సు సరైన ఫ్రేమ్‌లో లేదని నేను భావిస్తున్నాను. అతని సామర్థ్యంపై ప్రశ్నే లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూడాలి. దక్షిణాఫ్రికాలో కూడా కోహ్లీని చూశాం.” అని అన్నాడు.

Read Also.. U19 World Cup: అండర్ 19 ఛాంపియన్లపై బీసీసీఐ కీలక ప్రకటన.. విండీస్ నుంచి నేరుగా అహ్మదాబాద్‌కే.. ఎందుకంటే?