Tamil Nadu: కాలువలో తేలియాడుతోన్న సూటుకేసు.. తెరిచి చూడగా పోలీసులకు షాక్..

అదొక రద్దీగా ఉండే రహదారి. ప్రతీ రోజూ వేలల్లో వాహనాలు ఆ రోడ్డుపై పరుగులు పెడుతుంటాయి. ఇదిలా ఉంటే..

Tamil Nadu: కాలువలో తేలియాడుతోన్న సూటుకేసు.. తెరిచి చూడగా పోలీసులకు షాక్..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 07, 2022 | 6:36 PM

అదొక రద్దీగా ఉండే రహదారి. ప్రతీ రోజూ వేలల్లో వాహనాలు ఆ రోడ్డుపై పరుగులు పెడుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఆ రోడ్డుకు ఆనుకుని ఉన్న కాలువలో ఓ సూటుకేసు తేలియాడుతోంది. ముందుగా దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా.. కొంత సమయం అనంతరం స్థానికులకు ఆ సూటుకేసుపై అనుమానం వచ్చింది. ఏదైనా బాంబ్ ఉండేమోనని.. వాళ్లు భయపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సూటుకేసును స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఏముంటుందోనని తెరిచి చూడగా ఒక్కసారిగా వారి ఫ్యూజులు ఔట్ అయ్యాయి. అందులో ఓ మహిళ మృతదేహం బయటపడింది. ఈ ఘటన చెన్నైలోని తిరుప్పూర్‌లో చోటు చేసుకుంది. తిరుపూర్ నుంచి ధారాపురం వెళ్తున్న రోడ్డుకి పక్కనే ఉన్న కాలువ వద్ద పోలీసులు ఈ సూటుకేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో లభ్యమైన మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళకు సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమె వివరాల సేకరణపై దృష్టి సారించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి.. సూటుకేసులో చుట్టి ఈ కాలువలో పడేసి ఉంటారని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. నిందితులు ఎవరన్న దానిపై తిరుప్పూర్ నుంచి ధారాపురం వెళ్తున్న రోడ్డులో ఉన్న సీసీటీవీల విజువల్స్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Also Read: ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరుతో పాట కూడా ఉందండోయ్!