Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరుతో పాట కూడా ఉందండోయ్!

Tollywood Heroine: తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను ఫ్యాన్స్ చాలా భద్రంగా దాచుకుంటుంటారు. ఇక నటీమణుల చైల్డ్‌హుడ్ ఫోటోల గురించి ప్రత్యేకంగా...

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరుతో పాట కూడా ఉందండోయ్!
Tollywood Heroine 1
Follow us

|

Updated on: Feb 07, 2022 | 5:50 PM

తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను ఫ్యాన్స్ చాలా భద్రంగా దాచుకుంటుంటారు. ఇక నటీమణుల చైల్డ్‌హుడ్ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను గుర్తించేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. సాయి పల్లవి, అనుష్క, శ్రియా, రాశి ఖన్నా.. ఇలా ఎందరో హీరోయిన్ల చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కోవలోనే తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమాయకంగా కనిపిస్తోన్న ఈ బుజ్జాయి తెలుగులో నటించిన తొలి సినిమాతోనే నటనలో మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత మెగా హీరో సరసన నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇక మూడో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుని.. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. తన లేటెస్ట్ ఫొటోస్, సినిమా అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అటు గ్లామర్‌తో.. ఇటు నటనతో సినిమా సినిమాకూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటూపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈమె నటించిన మూడు బడా సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఎవరో గుర్తుపట్టారా.?

Tollywood Heroine

ఈమెవరో కాదండీ.! బుట్టబొమ్మ పూజా హెగ్డే. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా హెగ్డే.. ఆ తర్వాత నటించిన ‘ముకుందా’ సినిమాతో నటనలో మంచి మార్కులు దక్కించుకుంది. ఇక ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు పూజా హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)