YSRCP: సీఈసీ, హైకోర్టు ఆదేశాలపై వైసీపీ కీలక నిర్ణయం.. పోస్టల్ బ్యాలెట్లపై మరో పిటిషన్..

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎక్కడా తగ్గేదేలే అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరికొద్ది గంటల సమయం ఉండటంతో పోస్టల్ బ్యాలెట్లపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్‌, హోదా లేకుండా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైసీపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

YSRCP: సీఈసీ, హైకోర్టు ఆదేశాలపై వైసీపీ కీలక నిర్ణయం.. పోస్టల్ బ్యాలెట్లపై మరో పిటిషన్..
Ysrcp
Follow us
Srikar T

|

Updated on: Jun 02, 2024 | 9:05 PM

పోస్టల్‌ బ్యాలెట్లపై ఎక్కడా తగ్గేదేలే అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు మరికొద్ది గంటల సమయం ఉండటంతో పోస్టల్ బ్యాలెట్లపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్‌, హోదా లేకుండా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైసీపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైసీపీ.. పోస్టల్‌ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడంపై అధికార వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఓ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్‌ కిరణ్మయి ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.

ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్‌ చేస్తూ ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైసీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఏపీలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. గెలుపోటములను నిర్ణయించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లింది వైసీపీ. అక్కడ రేపు ఎలాంటి వాదలను జరగనున్నయన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!