AP News: ఆ రోజు స్వీట్లు పంచుకోవడం కుదరదని ముందుగా సంబరాలు.. సజ్జల మాస్ కౌంటర్స్..

ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయిన ఎగ్జిట్ పోల్ సర్వేలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఎన్డీయే కోసం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉందన్నారు. బీహార్, తమిళనాడు, ఒరిస్సాలో పోటీ చేసిన వాటికి.. చెయ్యని వాటికి సంబంధం లేకుండా ఇచ్చారన్నారు. కూటమిలో ఉన్న టీడీపీకి మేలు చేయాలని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉందని చెప్పారు. ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలా అని ప్రశ్నించారు.

AP News: ఆ రోజు స్వీట్లు పంచుకోవడం కుదరదని ముందుగా సంబరాలు.. సజ్జల మాస్ కౌంటర్స్..
Sajjala Rama Krishana Reddy
Follow us
Srikar T

|

Updated on: Jun 02, 2024 | 2:51 PM

ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయిన ఎగ్జిట్ పోల్ సర్వేలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఎన్డీయే కోసం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉందన్నారు. బీహార్, తమిళనాడు, ఒరిస్సాలో పోటీ చేసిన వాటికి.. చెయ్యని వాటికి సంబంధం లేకుండా ఇచ్చారన్నారు. కూటమిలో ఉన్న టీడీపీకి మేలు చేయాలని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉందని చెప్పారు. ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తీసుకోకుండా సరైన ఎగ్జిట్ పోల్స్ ఎవరు చెప్పలేరన్నారు. 5 ఏళ్ల పాలన అభివృద్ది చూసి ఓట్లు వేయాలని అడిగాం. లోకల్‎గా ఉన్న సర్వే సంస్థలు వైసిపి గెలుస్తుందని చెప్పినట్లు వివరించారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం గందరగోళంగా ఇచ్చాయన్నారు. కూటమిగా వచ్చారు కాబట్టే ఏదో జరిగింది.. జరుగుతుందని అనే భ్రమ కల్పించే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల కమిషన్ కొందరికి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

తాము గెలుస్తాం అని టీడీపీ హడావుడి చేస్తోంది. లోకల్ సర్వేల్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుందని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తాము పాజిటివ్ థింకింగ్‎తో ఎన్నికల ప్రచారం చేశామన్నారు సజ్జల. జగన్‎ను తిట్టడమే పనిగా పెట్టుకుని టీడీపి ఎన్నికల ప్రచారం చేసిందన్నారు. 48గంటల్లో ఫలితం తేలిపోతుందని స్పష్టం చేశారు. ఓటమికి తాము కారణాలు వేతుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ రూల్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎపీలో ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. ఏపీకి మాత్రమే ప్రత్యేకంగా వేసులుబాటు ఎందుకని అడిగారు. పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. పిన్నెల్లికి బెయిల్ వస్తె మళ్ళీ అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. కౌంటింగ్‎లో అక్రమాలు చేయాలని టీడీపీ చూస్తోందని చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. తెర వెనుక ఏదో చేయాలని చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అస్సలు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు.. ఎందుకు వెళ్ళారో ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు.

ఆరా మస్తాన్ తమకు ఏమి 150 సీట్లు వస్తాయని చెప్పలేదు. అతనికి వచ్చిన వివరాల మేరకే ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించారని వివరించారు. ఆరా మస్తాన్ చెప్పిన వాటి కంటే ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయన్నారు. పాజిటివ్ ఓటు బ్యాంక్ తమవైపే ఉందని ధీమాను వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యాక ఓడిపోతే స్వీట్స్ పంచుకోవడం కుదరదని టీడీపీ ముందుగానే సంబరాలు చేసుకుంటోందని చురకలు అంటించారు. అందుకే ఇప్పుడే సంబరాలు చేసుకుంటున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి