Kakinada: తీరానికి కొట్టుకొస్తున్న బంగారం.. ఉప్పాడ బీచ్‌కు పోటెత్తిన జనం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్‌లలో గత రెండు రోజులుగా మహిళలు, పిల్లలు సహా వందలాది మంది మత్స్యకారులు బంగారు కోసం వేట సాగిస్తున్నారు. ఇటీవలి తుఫాను కారణంగా పోటెత్తిన అలల నేపథ్యంలో ఒడ్డుకు బంగారు నాణేలు, పూసలు కొట్టుకువచ్చి ఉంటాయనే ఆశతో బీచ్ ఇసుకను జల్లెడ పడుతున్నారు.

Kakinada: తీరానికి కొట్టుకొస్తున్న బంగారం.. ఉప్పాడ బీచ్‌కు పోటెత్తిన జనం
Uppada Beach
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 03, 2024 | 12:18 PM

వర్షాల సీజన్ స్టార్ట్ అవ్వడంతో.. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలయ్యింది. ఇప్పటికే పలువురుకి వజ్రాలు దొరికినట్లు.. వాటిని భారీ రేటుకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది.  తాజాగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తాయన్నాయని ప్రచారం మొదలైన క్రమంలో.. తమ ఫేట్ టెస్టు చేసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి వచ్చి.. వెతుకులాట మొదలెట్టారు.

భారీ వర్షాలు, సైక్లోన్లు, పోటు సమయంలో సముద్రం అల్లకల్లోంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఆ సమయంలో అలలు గట్టిగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ సమయంలో అలలతో పాటు ఇసుక, పలు రకాల సముద్ర జీవలు, ద్రవ, ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. పూర్వం కోటలు, పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతుంటాయన్నది వారి వెర్షన్.

గతంలో తుఫాను వచ్చినప్పుడు కోనపాపపేట తీరం ఒడ్డున ఇసుకలో పురాతన సిల్వర్ కాయిన్స్ దొరికాయి.  ఉప్పాడ తీరంలోని మంగళ దిబ్బ ప్రాంతంలో పలుమార్లు బంగారం లభ్యం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  అల్పపీడనాలు, తుఫాన్లు సంభవించిన సమయాల్లో కెరటాలు తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందని..   సముద్రంలో కలిసిపోయిన బంగారు వస్తువుల ముక్కలు ఒడ్డుకు కొట్టుకువస్తాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను కారణంగా ఉప్పాడ తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మత్స్యకారులు, స్థానికులు గత రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం అక్కడే వెతుకులా కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..