TDP: ఏపీలో కూట‌మి తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌న్న చంద్రబాబు.. పార్టీ నేతలతో సమావేశం..

ఎన్నిక‌ల కౌంటింగ్‎కు మ‌రికొన్ని గంట‌లు మాత్రమే స‌మ‌యం ఉండ‌టంతో కూట‌మి పార్టీల నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు మూడు పార్టీల నేత‌లు మౌనం వ‌హించారు. ప్రధాని మోడీ నామినేష‌న్ వేసిన రోజు మాత్రమే వార‌ణాసిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీయే విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత విదేశీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన చంద్రబాబు.. మూడు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‎కు వచ్చారు. ఆ త‌ర్వాత శ‌నివారం రాత్రి ఉండ‌వ‌ల్లి నివాసానికి చేరుకున్నారు.

TDP: ఏపీలో కూట‌మి తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌న్న చంద్రబాబు.. పార్టీ నేతలతో సమావేశం..
Chandrababu
Follow us
pullarao.mandapaka

| Edited By: Srikar T

Updated on: Jun 02, 2024 | 5:33 PM

ఎన్నిక‌ల కౌంటింగ్‎కు మ‌రికొన్ని గంట‌లు మాత్రమే స‌మ‌యం ఉండ‌టంతో కూట‌మి పార్టీల నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు మూడు పార్టీల నేత‌లు మౌనం వ‌హించారు. ప్రధాని మోడీ నామినేష‌న్ వేసిన రోజు మాత్రమే వార‌ణాసిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీయే విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత విదేశీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన చంద్రబాబు.. మూడు రోజుల క్రిత‌మే హైద‌రాబాద్‎కు వచ్చారు. ఆ త‌ర్వాత శ‌నివారం రాత్రి ఉండ‌వ‌ల్లి నివాసానికి చేరుకున్నారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఫ‌లితాల విష‌యంలో ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. అయితే కౌంటింగ్‎కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావ‌డంతో కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్ధుల‌తో ఆయా పార్టీల నేత‌లంతా క‌లిసి జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కౌంటింగ్ రోజు అభ్యర్ధుల‌తో పాటు ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై దిశానిర్ధేశం చేసారు. ఇక ఏపీలో ఎన్డీయే కూట‌మి 21 ఎంపీ సీట్లు గెల‌వ‌బోతుంద‌ని ఎగ్జిట్ పోల్స్‎లో వ‌చ్చింద‌ని.. రాష్ట్రంలో కూడా 53 శాతం ఓట్లతో కూట‌మి తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌ని బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ అరుణ్ సింగ్ చెప్పారు. అటు చంద్రబాబు సైతం కూట‌మి తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు.

కౌంటింగ్ ఏజెంట్లకు సూచ‌న‌..

అభ్యర్ధుల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‎లో చంద్రబాబు ప‌లు సూచ‌న‌లు చేసారు. కూట‌మి విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్‎పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు చంద్రబాబు. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‎పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్న చంద్రబాబు.. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు.

కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని.. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‎ల నుండి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలన్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాల‌న్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడిగాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ.. కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి
పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?
రుణ దరఖాస్తు పదే పదే తిరస్కరణకు గురవుతుందా? కారణం ఏంటో తెలుసా?
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా