Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ, ఏపీలో ఆ పార్టీలదే హవా.. టీవీ9 పోల్ స్ట్రాట్ సంచలన సర్వే..
Telangana - Andhra Pradesh Lok Sabha Exit Poll 2024: టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ 2024 ఫలితాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సంచలన సర్వే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాలకు ఎన్డీయే కూటమికి 12 స్థానాలు వస్తాయని అంచానా వేసింది. అందులో తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు కైవసం చేసుకోగా.. జనసేనకు 1, బీజేపీకు 2 స్థానాలు వస్తాయని పేర్కొంది.
టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ 2024 ఫలితాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సంచలన సర్వే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాలకు ఎన్డీయే కూటమికి 12 స్థానాలు వస్తాయని అంచానా వేసింది. అందులో తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు కైవసం చేసుకోగా.. జనసేనకు 1, బీజేపీకు 2 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి 13 స్థానాలు వస్తాయని తెలిపింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండియా కూటమికు 8 సీట్లు సాధిస్తుందని తెలిపింది. అలాగే ఎన్డీయేకు 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించనున్నట్లు తెలిపింది.
ఆరా మస్తాన్ సర్వే ప్రకారం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. ఇక బీజేపీకు 8 నుంచి 9 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుదని తెలిపింది. ఇతరులకు 1 స్థానం అని ప్రకటించింది. అందులో బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఎవరికైనా రావొచ్చు అని చెబుతున్నారు. ఇదే ఆరా మస్తాన్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కచ్చితమైన అంచనాలను వెలువరించారు.
మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.