Telangana: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగలేఖ.. ఏమన్నారంటే..
తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ప్రజల పక్షాన తాను ఈ బహిరంగ లేఖ రాస్తున్నాట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పక్షాన ఎవరు హాజరు కారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అమరవీరుల త్యాగాల ఫలితం అని కాకుండా, కాంగ్రెస్ దయాబిక్ష అని ప్రచారం చేస్తున్న మీ బావదారిద్ర్యాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది సత్యం అన్నారు. మీరు దాచేస్తే తాగదని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా ప్రజల పక్షాన తాను ఈ బహిరంగ లేఖ రాస్తున్నాట్లు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పక్షాన ఎవరు హాజరు కారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అమరవీరుల త్యాగాల ఫలితం అని కాకుండా, కాంగ్రెస్ దయాబిక్ష అని ప్రచారం చేస్తున్న మీ బావదారిద్ర్యాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది సత్యం అన్నారు. మీరు దాచేస్తే తాగదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఇప్పటివరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదన్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదు ఇక మారదు అని విమర్శించారు. తెలంగాణలో ఆరు నెలలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పరిపాలన ఎందుకు నిదర్శనం అని అన్నారు. ఈ ఆరు నెలల్లో ప్రజా జీవితం అస్తవ్యస్తమైందని తెలిపారు.
తెలంగాణలో ద్వి దశాబ్ధి ఉత్సవాలకు సీఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కు కూడా స్వయంగా రాజ్ భవన్ కు వెళ్లి ఆహ్వానం అందించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ సర్కార్ ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కూడా ప్రత్యేక ఆహ్వానం పంపించింది. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా లేఖరాశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే వ్యక్తిగత ఆహ్వాన పత్రిక పంపించినట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతి ఉత్తరం రాయడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు కేసీఆర్ హాజరుకావడం లేదనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గామారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..