AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆ రూల్స్ తప్పక పాటించాలి.. మీనా కీలక ఆదేశం..

ఓట్ల లెక్కింపుకు గ‌డువు ద‌గ్గర‌ప‌డ‌టంతో కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీల‌క సూచ‌న‌లు చేశారు. అన్ని జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎస్సీలు, సీపీల‌తో స‌చివాల‌యం నుంచి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నందున ఓట్ల లెక్కింపు రోజు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. కేవలం జూన్ 4న కాకుండా దానికి ముందు, తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు.

AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆ రూల్స్ తప్పక పాటించాలి.. మీనా కీలక ఆదేశం..
Mukesh Kumar Meena
Follow us
pullarao.mandapaka

| Edited By: Srikar T

Updated on: Jun 02, 2024 | 6:00 PM

ఓట్ల లెక్కింపుకు గ‌డువు ద‌గ్గర‌ప‌డ‌టంతో కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీల‌క సూచ‌న‌లు చేశారు. అన్ని జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎస్సీలు, సీపీల‌తో స‌చివాల‌యం నుంచి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నందున ఓట్ల లెక్కింపు రోజు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. కేవలం జూన్ 4న కాకుండా దానికి ముందు, తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. ఇటు వంటి భావోద్వేగాలతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఆదేశాల‌ను పాటించాల‌ని ముకేష్ కుమార్ మీనా సూచించారు.

కౌంటింగ్ విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

కౌంటింగ్ విష‌యంలో తీసుకోవ‌ల్సిన జాగ్రత్తల‌పై మ‌రోసారి సూచ‌న‌లు చేసారు సీఈవో. ఈవీఎంల కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపర్చాలని, ఆ పనిని వాయిదా వేయవద్దన్నారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు మరుసటి రోజే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై ప‌లు సూచ‌నలు చేసారు. ఇండెక్సు కార్డులో ఎటు వంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలని చెప్పారు. ఆయా కార్డులు అన్నీ జూన్ 8 లోపు తమ కార్యాలయానికి అందజేయాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‎ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. అయితే ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్‎కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను లేక పెన్సిల్, ప్లైయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలన్నారు. అంతకు మించి ఏమి ఉన్నా అనుమతించవద్దన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పని సరిగా పొందాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించడం, నిష్క్రమించడంపై ప్రణాళికను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..