India Today Exit Poll: ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసిన ఇండియా టుడే
ఏపీలో జరిగిన హోరాహోరీ పోరులో విజయం ఎవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? వైసీపీకి కొన్ని సంస్థలు పట్టం కడుతుంటే, టీడీపీ కూటమిదే విజయం అంటున్నాయి మరి కొన్ని సంస్థలు. తాజాగా ఇండియా టుడే సంస్థ ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయ్.. ఏపీలో మాత్రం సస్పెన్స్ అలానే కొనసాగుతోంది. కొన్ని సర్వేలు అధికార వైసీపీకి ఎడ్జ్ ఇవ్వగా.. మరికొన్ని కూటమి వైపు మొగ్గు చూపాయి. బట్ అందరూ ఎదురుచూస్తున్న యాక్సిస్ మై ఇండియా ఏపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్‌ను తాజాగా వెలువరించింది. కూటమికి 98 నుంచి 120 సీట్లు.. వైసీపీకి 55 నుంచి 77 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
పార్టీల వారీగా చూస్తే…. టీడీపీకి 78 నుంచి 96 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని… , జనసేన 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు, వైసీపీకి 55 నుంచి 77 సీట్లు, కాంగ్రెస్‌కు 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇండియా టుడే అంచనా వేసిన ఓట్ షేర్
- వైఎస్సార్‌సీపీ : 44 పర్సెంట్
- టీడీపీ : 42 పర్సెంట్
- జనసేన : 7 పర్సెంట్
- బీజేపీ : 2 పర్సెంట్
- కాంగ్రెస్ + : 2 పర్సెంట్
- ఇతరులు : 3 పర్సెంట్
ఇక పార్లమెంట్ సీట్స్ విషయానికి వస్తే… టీడీపీకి 13 – 15, బీజేపీకి 4 – 6, జనసేనకు 2, వైసీపీకి 2 – 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఎన్డీయే కూటమి విషయానికి వస్తే టీడీపీ 144 స్థానాల్లో, జేఎస్పీ 21 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడవ్వనున్నాయి. (Source)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..