Andhra pradesh: ‘ఆయన వెళ్లింది సంక్రాంతి మాముళ్ల కోసమే’… చంద్రబాబు, పవన్ భేటీపై వైసీపీ నాయకుల అటాక్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. ఆదివారం పవన్, చంద్రబాబు హైదరాబాద్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ పూర్తయిన తర్వాత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. ఆదివారం పవన్, చంద్రబాబు హైదరాబాద్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ పూర్తయిన తర్వాత ఇద్దరు నాయకులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతల హక్కులను వైసీ కాలరాస్తోందంటూ పవన్ ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిణామాలు, కుప్పంలో జరిగిన సంఘటకు సంబంధించిన ఇరువురు చర్చించినట్లు పవన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పవన్, చంద్రబాబు భేటీపై అంతకు ముందు వైసీపీ నాయకులు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
వైసీపీ మంత్రి అంబటి రాంబాటు చంద్రబాబు, పవన్ భేటీపై సెటైర్లు వేశారు. ‘సంక్రాంతికి అందరింటికీ గంగిరెద్దులు వెళ్తాయి, చంద్రబాబు ఇంటికి పవన్‌కల్యాణ్ వెళ్లాడు. డూడూ బసవన్నలా తల ఊపడానికి వెళ్లాడు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘సంక్రాంతి మామూళ్ల కోసం.. దత్త తండ్రి దగ్గరకు దత్తపుత్రుడు వెళ్లారు’ అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అని మరోసారి రుజువైందని మంత్రి కారుమూరి నాగేశ్వరారావు విమర్శించారు.




సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్‌కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! @ncbn @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) January 8, 2023
సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి@ncbn వద్దకు దత్త పుత్రుడు@PawanKalyan
— Gudivada Amarnath (@gudivadaamar) January 8, 2023
ప్యాకేజ్ రేటు పెంచుకోవడానికే పవన్ చంద్రబాబు దగ్గరికి వెళ్లారని ఎంపీ మార్గాని భరత్ అటాక్‌కు దిగారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని, పవన్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై రియాక్ట్ అయిన కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్… పవన్ కల్యాణ్ ముసుగు తొలిపోయిందని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..