Chandrababu - Pawan Kalyan PressMeet: ప్రతిపక్ష నేత హక్కులను కాలరాస్తున్నారు- చంద్రబాబు, పవన్

Chandrababu – Pawan Kalyan PressMeet: ప్రతిపక్ష నేత హక్కులను కాలరాస్తున్నారు- చంద్రబాబు, పవన్

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 08, 2023 | 2:45 PM

ప్రస్తుత పరిణామాల మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్..


ప్రస్తుత పరిణామాల మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్.చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, తదితర విషయాలపై కూడా మాట్లాడనున్నారు.గతంలో పవన్‌ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు పవన్‌ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వస్తుండంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.ఈనెల 12న శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభ గురించి కూడా చర్చించనున్నారు. ఆ కార్యక్రమామానికి పోలీసులు విధించిన పలు ఆంక్షలపై ఇప్పటికే జనసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. విపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ, జనసేన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

Published on: Jan 08, 2023 01:46 PM