Pawan – Chandrababu Exclusive Video: తన నివాసం వద్ద పవన్ కారు దగ్గిరకి వెళ్లి స్వాగతం పలికిన చంద్రబాబు..వీడియో.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ రానున్నారు.
ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రోడ్‌షోల రద్దు జీవో, ఆంక్షలపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు. దీంతోపాటు ఇటీవల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, తదితర విషయాలపై కూడా మాట్లాడనున్నారు.గతంలో పవన్ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు పవన్‌ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వస్తుండంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.ఈనెల 12న శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభ గురించి కూడా చర్చించనున్నారు. ఆ కార్యక్రమామానికి పోలీసులు విధించిన పలు ఆంక్షలపై ఇప్పటికే జనసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. విపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ, జనసేన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos