AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: పెళ్లికి సిద్ధమవుతున్నారా.? అయితే ముందు ఈ విషయాల్లో క్లారిటీ తెచ్చుకోండి.

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో జరిగే పెద్ద వేడుక పెళ్లి. వందేళ్ల జీవితానికి మజిలీగా చెప్పకునే పెళ్లి విషయంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో ప్లాన్స్‌ వేసుకుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి..

Marriage: పెళ్లికి సిద్ధమవుతున్నారా.? అయితే ముందు ఈ విషయాల్లో క్లారిటీ తెచ్చుకోండి.
Marriage Tips
Narender Vaitla
|

Updated on: Dec 13, 2022 | 3:57 PM

Share

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో జరిగే పెద్ద వేడుక పెళ్లి. వందేళ్ల జీవితానికి మజిలీగా చెప్పకునే పెళ్లి విషయంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో ప్లాన్స్‌ వేసుకుంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. తమ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తిపై ఎన్నో అంచనాలు మరెన్నో ఆశలు ఉండడం సర్వసాధారణం. అందుకే కాబోయే పాట్నర్‌కు సంబంధించి కొన్ని విషయాలైనా పెళ్లికి ముందు తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పుడైతే పెళ్లి తర్వాతే కపుల్స్‌ మాట్లాడుకునే వారు కానీ ప్రస్తుతం రోజులు మారాయి. వివాహానికి ముందే ఒకరికొకరు అభిప్రాయాలు, అభిరుచులు పంచుకునే రోజులు వచ్చాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీ వందేళ్ల జీవితానికి వారధిలా ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు కాబోయే పాట్నర్‌ నుంచి పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే..

* మీకు ఎలాంటి విషయాలు నచ్చుతాయి, ఎలాంటివి నచ్చవు వంటి వివరాలను మీకు కాబోయే వారికి తెలియజేయండి. అలాగే వారికి నచ్చని విషయాల గురించి తెలుసుకోండి. ఏ విషయాలు మీ పాట్నర్‌కు నచ్చవో వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

* మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో అన్నట్లు. ఎంత ప్రేమ ఉన్నా డబ్బు విషయంలో ఎక్కడో ఒక దగ్గర అభిప్రాయాల బేధాలు వస్తుంటాయి. కాబట్టి పెళ్లికి ముందే మీ ఆర్థిక వనరులు, ఖర్చుల గురించి పాట్నర్‌తో పంచుకోండి. భవిష్యత్తులు ఇది గొడవలు రాకుండా కాపాడుతుంది.

* పిల్లల విషయంలోనూ క్లారిటీ తీసుకోవాల్సిన రోజులివి. కెరీర్‌ విషయంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానంగా రాణిస్తోన్న ఈ రోజుల్లో పిల్లల విషయం గురించి కూడా పెళ్లికి ముందే ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం.

* వివాహం తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. జీవితంలో ఎలాంటి ప్రణాళికలు రచించాలనుకుంటున్నారు లాంటి వివరాలపై ఓ క్లారిటీతో ఉండాలి. అదే విషయాన్ని మీ పాట్నర్‌కు కూడా వివరించాలి.

* కుటుంబం విషయంలో కూడా మీకు కాబోయే పాట్నర్‌ నుంచి పెళ్లికి ముందే స్పష్టత తీసుకోవాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో జీవించే వారు తమ భవిష్యత్తు గురించి ముందుగానే పాట్నర్‌తో చర్చించుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!