Krishna District: మూడు పెళ్ళిళ్లు చేసుకున్న దొంగ మొగుడిపై రెండో భార్య ఫిర్యాదు
విడాకులు ఇవ్వకుండా మరొక పెళ్లి చేసుకున్న భర్తపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ భార్య మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మచిలీపట్నంలో వెలుగుచూసింది. తనతో పెళ్లికాక ముందు కూడా భర్త మరొక మహిళను పెళ్లాడని.. ఇప్పుటికి 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆమె చెబుతోంది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడిపై ఓ మహిళ మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన బాధిత మహిళ డిమాండ్ చేసింది.
బందరు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన బుంగా రామ్ చరణ్‌తో 2020లో తనకు వివాహం జరిగిందని ఆమె చెబుతోంది. అయితే పెళ్లి అయిన రోజు నుండి తనను చిత్ర హింసలకు గురి చేశాడని వాపోతుంది. ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకుండా మూడు రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపింది. తనతో పెళ్లి కాక ముందు కూడా వేరే మహిళతో రామ్ చరణ్ కు వివాహం అయినట్టు ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ పోలీసులను కోరుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..