AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ పదవి ఈసారి ఎవరికి దక్కనుందో తెలుసా ?.. ఏపీలో ఇదే చర్చ

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నూతన చైర్మన్ గా కొత్త పేరు ప్రచారంలోకి వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయింది. రెండేళ్ళ పాటు టీటీడీ బోర్డు పదవీకాలం ఉంది. రెండుసార్లు వంతున నాలుగెళ్ళ పాటు సీఎం జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఈ కీలక పదవిని అప్పగించారు.

Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ పదవి ఈసారి ఎవరికి దక్కనుందో తెలుసా ?.. ఏపీలో ఇదే చర్చ
TTD
S Haseena
| Edited By: Aravind B|

Updated on: Jul 17, 2023 | 1:15 PM

Share

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నూతన చైర్మన్ గా కొత్త పేరు ప్రచారంలోకి వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయింది. రెండేళ్ళ పాటు టీటీడీ బోర్డు పదవీకాలం ఉంది. రెండుసార్లుగా నాలుగెళ్ళ పాటు జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఈ కీలక పదవిని అప్పగించారు.ఆయన రాజ్యసభ ఎంపీ కోరుకున్నారు అని ప్రచారంలో ఉన్నా జగన్ మాత్రం టీటీడీ వంటి ప్రతిష్ఠాత్మకమైన బోర్డుకి ఛైర్మన్‎గా రెండు సార్లు నియమితులయ్యారు. మరోవైపు ఆయనకు ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎన్నికల వేళ ఆయన పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయనకు ఈసారి రెన్యూవల్ లేదు అని అంటున్నారు. అయినా గరిష్ఠంగా రెండు సార్లు ఆయనకు ఇచ్చినందువల్ల మరొకరికి ఈ పదవిని ఎంపిక చేస్తారు అని ప్రచారం నడుస్తోంది.

ఈ ఏడాది ఆగస్ట్ 12 తో వైవీ సుబ్బారెడ్డి పదవి పూర్తి కానుంది. అందుకే జగన్ కొత్త వారి కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఈ కీలకమైన పదవికి మూడు పేర్లు జగన్ టేబుల్ మీద ఉన్నాయని వైసీపీ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. మొదటిది గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి. రెండవది మాజీ మంత్రి, యానాం ఎమ్మెల్యే మళ్ళాడి కృష్ణ రావు.. మూడవది పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి పేరు వినిపిస్తుంది. ఈ ముగ్గురిలో చూస్తే జంగా క్రిష్ణమూర్తికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ లో టాక్. పార్థ సారధి తాను ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నారు కాబట్టి ఆ పదవి తనకి వద్దని భావిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అయితే బీసీ సామాజిక వర్గం యాదవ కమ్యూనిటీకి చెందిన జంగా క్రిష్ణమూర్తికి బీసీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల వేళ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనను ఎంపిక చేస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చినందువల్ల రెడ్డిలకు అవకాశం లేదని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. దీంతో జంగా క్రిష్ణమూర్తికే ఈ కీలకమైన పదవి దక్కనుందని తాడేపల్లి క్యాంప్‌లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..