అబ్బాయ్ చౌదరి వర్సెస్ చింతమనేని : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మళ్లీ పొలిటికల్ ఫైట్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మళ్లీ పొలిటికల్ ఫైట్ షరూ అయింది. అబ్బాయ్ చౌదరి వర్సెస్ చింతమనేని ప్రభాకర్ మధ్య చాలాకాలం తర్వాత ఇవాళ మళ్లీ పోరు మొదలైంది...

Abbai chowdary – Chintamaneni: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మళ్లీ పొలిటికల్ ఫైట్ షరూ అయింది. అబ్బాయ్ చౌదరి వర్సెస్ చింతమనేని ప్రభాకర్ మధ్య చాలాకాలం తర్వాత ఇవాళ మళ్లీ పోరు మొదలైంది. దెందులూరు మండలం సోమవారంపాడు దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఆదివారం పూట ఘర్షణకు దిగారు. అసలు వివాదం ఎందుకొచ్చిందంటే.. స్థానికంగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో దెందులూరు రోడ్డు దెబ్బతింది.
రోడ్ల గుంతలను కంకరతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూడ్చారు. అనుచరులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మరమ్మత్తు పనులను వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఇప్పటికే ఈ రోడ్డు విస్తరణకు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని…రేపు పనులు ప్రారంభించబోతుండగా చింతమనేని రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.
వైసీసీ, టీడీపీ నేతల మధ్య తోపులాటతో టెన్షన్ రేగింది. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్బంగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. నువ్వా.. నేనా.. అంటూ సవాళ్లు విసురుకున్నారు.
Read also: CM Stalin: పొలిటికల్ స్పైస్ మిస్సైంది..! హుందాతనమైన రాజకీయ పరిమళాల ఆస్వాదనలో తమిళ తంబీలు.?