ఏపీ ఫైబర్ డొంక కదులుతోంది, వందల కోట్ల అవినీతి.. భారీ తప్పుడు నియామకాలు బట్టబయలు ఖాయం : గౌతం రెడ్డి

ఏపీ ఫైబర్ నెట్ తీగలాగితే డొంక మొత్తం కదలడం ఖాయమంటున్నారు ఆ సంస్థ చైర్మన్ గౌతం రెడ్డి. గత టీడీపీ పాలకుల్లోని చిన్నాపెద్ద అందరి పేర్లు బయటకొస్తాయని అంటున్నారు...

ఏపీ ఫైబర్ డొంక కదులుతోంది, వందల కోట్ల అవినీతి.. భారీ తప్పుడు నియామకాలు బట్టబయలు ఖాయం : గౌతం రెడ్డి
Ap Fibernet Gowtham Reddy

Goutham Reddy: ఏపీ ఫైబర్ నెట్ తీగలాగితే డొంక మొత్తం కదలడం ఖాయమంటున్నారు ఆ సంస్థ చైర్మన్ గౌతం రెడ్డి. గత టీడీపీ పాలకుల్లోని చిన్నాపెద్ద అందరి పేర్లు బయటకొస్తాయని అంటున్నారు. వందల కోట్ల అవినీతి.. భారీ ఎత్తున తప్పుడు నియామకాలు జరిగాయని.. సీఐడీ విచారణలో ఇవన్నీ బట్టబయలు కాబోతున్నాయని గౌతం రెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగుదేశంపార్టీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ అంశంలో జరిగిన అవినీతి, అక్రమాలపై టీవీ9 తో మాట్లాడిన గౌతమ్ రెడ్డి.. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో.. రూ. 700కోట్ల నుంచి రూ. 1000 కోట్లు అవినీతి జరిగిందని వెల్లడించారు. “తప్పుడు విధానాల్లో నియామకాలు జరిగాయ్.. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు.. ఈ మొత్తం వ్యవహారాలు త్వరలోనే బయటకొస్తాయ్.. ఈ అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి..” అని తెలిపారు.

“ఈ స్కామ్ లో మాజీ మంత్రి నారా లోకేష్ ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ పై గతం నుంచీ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయ్. సెట్ టాప్ బాక్సుల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయ్.. కాబట్టి ఈ అవకతవకలకు కారకులెవరో తేల్చేందుకు.. సీఐడీ విచారణకు ఆదేశించాం” అని ఏపీ ఫైబర్ నెట్ కొత్త చైర్మన్ గౌతం రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఫైబర్ నెట్ ఫ్రాడ్ పై కచ్చితమైన ఆధారాలను సేకరించామనీ.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తాయంటున్నారు.

కాగా, గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read also: Leopard : తిరుమలలో కలకలం పుట్టిస్తోన్న చిరుతపులులు.. నేడు మళ్లీ ఘాట్ రోడ్‌లో పులి ప్రత్యక్షం

Click on your DTH Provider to Add TV9 Telugu