Nandigama: కృష్ణాజిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, బరిసెలతో కొట్లాట.. 13 మందికి గాయాలు
కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థలం విషయంలో వివాదం చెలరేగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా....

Nandigama: కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థలం విషయంలో వివాదం చెలరేగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఏ ఒక్కరూ విన్లేదు. కానిస్టేబుల్ ముందే తెగ కొట్టుకున్నారు. ఈ దాడిలో 13 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కొందరు అక్కడే కుప్పకూలిపోయారు. స్థానిక హరిజనవాడలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పర దాడికి పాల్పడ్డంతో పోలీసులు సైతం ఇరువర్గాల్నీ అదుపుచేయలేక చేతులెత్తేశారు.
గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక నివేశన స్థల వివాదంపై బొడ్డు జ్ఞానానందం,(ఒక వర్గం) బొడ్డు చిన్న మల్లేశ్వరరావు(2వ వర్గం) మధ్య రాజుకున్న రగడ గ్రామంలో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది.
గాయపడ్డ వారిలో ఐదుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ప్రేక్షక పాత్రలో ఫోటోలు, వీడియోలకే పరిమితమై.. ఇరు వర్గాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడం విశేషం.

Nandigama 2
Read also: ఏపీ ఫైబర్ డొంక కదులుతోంది, వందల కోట్ల అవినీతి.. భారీ తప్పుడు నియామకాలు బట్టబయలు ఖాయం : గౌతం రెడ్డి