Weather Alert: మరో అల్పపీడనం..! పిడుగులాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. ఇక నాన్‌స్టాప్ వానలే వానలు..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్..

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. కాగా.. ఏపీ, తెలంగాణలో వచ్చే 24గంటల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది?.. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది?.. అనే వివరాలను తెలుసుకోండి..
కుండపోత వానలు..
ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్షసూచన చేస్తోంది. ముఖ్యంగా.. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని చోట్ల పిడుగులు పడే చాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు.. ఏపీలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం.. ఈ 11 జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ వెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 24జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ.. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రేపు కూడా తెలంగాణలోని మెజార్టీ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




