Watch: ఏపీలో వర్షాల ప్రభావం పెరిగే అవకాశం..ఎప్పటినుంచంటే..?
సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 2వ తేదీ తర్వాత ఏపీలో వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతాయని చెప్పారు.
విశాఖపట్నం: వచ్చే నెల 2వ తేదీ తర్వాత ఏపీలో వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. ఇక.. ఏపీ, తెలంగాణలో వచ్చే 24గంటల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది?.. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది?.. అనే అంశాలపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు ఇంకేమంటున్నారో మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు.
గోదావరికి కొనసాగుతోన్న వరద ఉధృతి
కాగా ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద ప్రవాహ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అలెర్ట్ మేసేజ్లు పంపిస్తున్నామన్నారు. వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువల వద్ద హెచ్చరిక సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద 6 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.58 లక్షల క్యూసెక్కులు ఉందని, రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,08,838 క్యూసెక్కులు ఉందని తెలిపారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీపరీవాహక లోతట్టు ప్రాంత గ్రామప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు.
రేపు (శనివారం) శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

