AP Weather Report: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వాడగాల్పులు..
Heat wave: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు సైతం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో రానునున్న రెండు రోజుల్లో...
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు సైతం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో రానునున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయి నుంచి, అతి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ తెలిపింది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబితాను విడుదల చేసింది. మంగళ, బుధ వారాల్లో రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో వడగాలులు వీచాయి, రానున్న రెండు రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుందన్న వివరాలను ప్రకటించింది..
* సోమవారం (25-04-2022)న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు అధికారులు ప్రకటించారు. వీటితో పాటు 30 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ప్రకటించారు.
* రానున్న 24 గంటల్లో (26-04-2022) అల్లూరి సీతరామరాజు జిల్లాలోని ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు, 55 మండలాల్లో అతితీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
* రానున్న 48 గంటల్లో (27-04-2022) రాష్ట్రంలోని అల్లూరి సీతరామరాజు, పార్వతిపురం మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో అతితీవ్ర వడగాల్పులతో పాటు, ఇతర ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు ఉండనున్నాయని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా ఏయే మండలాల్లో తీవ్రవడగాల్పులు, వడగాల్పులు, వడ గాల్పుల ప్రభావం లేని ప్రాంతాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని వాతావరణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Raveena Tandon: పవర్ స్టార్ కోసం రంగంలోకి రవీనా టాండన్.. ఆ సినిమాలో కీలక పాత్రలో ..
Acharya Movie: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
Lemon Side Effects: నిమ్మరసం అతిగా తాగుతున్నారా? అయితే ఈ అనర్థాలు మీరు తెలుసుకోవాల్సిందే