Lemon Side Effects: నిమ్మరసం అతిగా తాగుతున్నారా? అయితే ఈ అనర్థాలు మీరు తెలుసుకోవాల్సిందే

అతి ఏదైనా ప్రమాదమే.. అలాగే నిమ్మరసం కూడా.. వేడి చేసినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కచ్చితంగా నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Lemon Side Effects: నిమ్మరసం అతిగా తాగుతున్నారా? అయితే ఈ అనర్థాలు మీరు తెలుసుకోవాల్సిందే
Lemon
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 25, 2022 | 4:44 PM

Health Tips: నిమ్మ రేటు ఇప్పుడు ఎట్టా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్కోటి 10 రూపాయల లెక్క అమ్మేస్తున్నారు. ఎండాకాలం చల్లగా కాస్త నిమ్మరసం తాగలేని పరిస్థితి ఏర్పడింది. వేడి చేసినప్పుడు, ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు… నిమ్మరసం చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇది బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.  కాగా నిమ్మకాయ రసంతో ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మరసంలో ఉండే యాసిడ్ ఆమ్లాలు కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తాయి. అయితే నిమ్మరసాన్ని అధికంగా తాగే తొలి రోజుల్లో ఎలాంటి తేడా కనిపించదు. రోజులు గడిచేకొద్దీ… నెగెటివ్ ఎఫెక్ట్ మొదలవుతుంది.  ఆ దుష్ప్రభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

  1. గ్యాస్ట్రో ఈసోఫోల్ రిఫ్లెక్స్ డిసీజ్ : నిమ్మలో అసిడిక్ కంటెంట్ అధికంగా ఉండి.. హార్ట్ బర్న్, వికారం, వాంతులు, చెస్ట్ పెయిన్, గొంతు నొప్పి వంటి వాటికి దారితీస్తుంది.
  2.  పెప్టిక్ అల్సర్ : నిమ్మరసంను అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లా శాతం పెరిగి అంతర్గత లైనింగ్ ను దెబ్బతియ్యడం వల్ల పెప్టిక్ అల్సర్ పెరుగుతుంది.
  3. గాల్ బ్లాడర్ , కిడ్నీ స్టోన్స్ : నిమ్మతొక్కలో అధికంగా ఆక్సాలేట్స్ శరీరంలో క్రిస్టల్స్ గా మార్పు చెంది.. క్యాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. క్యాల్షియం బాడీలో శోషణ జరగకపోవడం వల్ల కిడ్నీలో, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ గా ఏర్పడుతాయి.
  4. ఐరన్ శోషణ : నిమ్మరసం, సిట్రిక్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రమంగా మన శరీరంలో ఉండే ఐరన్ ఉండాల్సినదానికి కంటే ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలా ఐరన్ అధికం కావడం వల్ల హీమో క్రొమటోసిస్, లేదా ఐరన్ ఓవర్ లోడ్ వంటి హెల్త్ డిజార్డర్స్ కు గురిచేస్తుంది.
  5. యూరినేషన్ : నిమ్మరసం యూరినేషన్ను పెంచుతుంది. దాంతో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
  6. మైగ్రేన్ తలనొప్పి: నిమ్మరసంలో ఉండే టైరామిన్ అనే అమినో యాసిడ్ బ్రెయిన్ కు సడెన్ గా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది అక్యుట్ మైగ్రేన్ లేదా క్రోనిక్ టెన్షన్, తలనొప్పికి దారితీస్తుంది.
  7.  దంత సమస్యలు: నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ లు టీత్ ఎనామిల్ కు హాని కలిగిస్తాయి. ఇది దంతక్షయం, దంతాల రంగు మారడం, డెంటల్ టిష్యులు దెబ్బతినడం, క్యావిటి సమస్యలకు దారి తీస్తుంది
  8. సన్ బర్న్ : అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యానికైనా..అందానికైనా నిమ్మరసంను మితంగా వాడుకుంటేనే మంచిది. లేదంటే సీరియస్ సన్ బర్న్ కు దారితీస్తుంది. స్కిన్ కంప్లెక్షన్స్ ను దెబ్బతీస్తుంది.
  9. జుట్టు సమస్యలుః నిమ్మరసంలో ఉండే సిట్రిక్ నేచుర్ తలలో డ్రైగా మార్చుతుంది.. ఇంటర్నల్ గా జుట్టు కణాలను, జుట్టును వీక్ గా మార్చుతుంది. దాంతో జుట్టు చాలా రఫ్ గా మారి..జుట్టు రాలే సమస్యలు కూడా పెరుగుతాయి.
  10.  స్టమక్ అప్ సెట్ : నిమ్మరసంను నేరుగా తీసుకోవడం వల్ల స్టమక్ అప్ సెట్ కు కారణమవుతుంది. పొట్టనొప్పి, లూజ్ మోషన్ కు దారితీస్తుంది.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే