Acharya Movie: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan)కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆచార్య చిత్రయూనిట్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణాలో టికెట్స్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. అలాగే ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు కూడా అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వారం రోజులపాటు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఆచార్య సినిమాలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆచార్య సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. చిరు, చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఆచార్య సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ను వినిపించనున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :