Bonda Uma: వాసిరెడ్డి పద్మ మీద మరోసారి తీవ్ర పదజలంతో విరుచుకుపడిన బోండా ఉమా
Bonda Uma: మహిళా కమిషషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపై(Vasireddy Padma) మరోసారి తీవ్ర పదజలంతో టీడీపీ నేత బోండా ఉమా విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మపై సంచలన కామెంట్స్ చేశారు..
Bonda Uma: మహిళా కమిషషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపై(Vasireddy Padma) మరోసారి తీవ్ర పదజలంతో టీడీపీ నేత బోండా ఉమా విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మపై సంచలన కామెంట్స్ చేశారు. వాసిరెడ్డి పద్మ ఇష్టారీతిన మర్యాద లేకుండా మాట్లాడుతుంది.. నువ్వు అరేయ్ ఒరేయ్ ఆంటే మేము ఒసేయ్ అనలేమా..? అని అన్నారు. మొత్తానికి సీఎం జగన్ ను ను వాసిరెడ్డి పద్మ తన తీరుతో రోడ్డుపై పడేసిందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
పద్మకు పబ్లిసిటీ పిచ్చి.. దీంతో సీఎం ను రోడ్డు మీద పడేసిందన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార బాధితురాలి విషయంలో టీడీపీ చేసిన ఉద్యమం ద్వారా ప్రభుత్వం లో కదలిక వచ్చింది. బాధితురాలికి అండగా ఉండటం చంద్రబాబు చేసిన తప్పా అన్నారు. దారుణ ఘటన జరిగితే మహిళా కమిషషన్ ఛైర్మన్ మూడు రోజులు మేకప్ వేసుకుని ఇంట్లో కూర్చోంది అంటూ ఎద్దేవా చేశారు. అసలు బాధితురాలిని పరామర్శించడానికి మేకప్ వేసుకుని హాస్పిటల్ కి వచ్చి అన్నీ అబద్దాలు చెప్తుంది. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోనే మాకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 27నలోపు అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామంటూ ఏపీ సర్కార్ ను హెచ్చరించారు.
ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు లేవు గానీ.. 30 గంటలపాటు అత్యాచారానికి రూమ్ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ. మాకు నోటీస్ ఇచ్చే హక్కు వాసిరెడ్డి పద్మకు లేదు.. కమిషన్ ముందు హాజరయ్యే ప్రసక్తే లేదన్నారు బోండా ఉమ.
మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: World Malaria Day: నేడు మలేరియా దినోత్సవం.. ఈ వ్యాధి లక్షణాలు.. రకాలు.. నివారణ చర్యలు