Watch Video: లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోనేరులో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూడగా..! వీడియో
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ ఇక్కడి ఆలయ కోనేరులో దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియోలో మహిళా కోనేరులో దూకడం..
మంగళగిరి, అక్టోబర్ 16: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ ఇక్కడి ఆలయ కోనేరులో దూకి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియోలో మహిళా కోనేరులో దూకడం కనిపించింది. చీర కట్టుకున్న ఓ మహిళ నడుకుంటూ వచ్చి కోనేరు గట్టు ఎక్కి ఒక్కసారిగా నీళ్లలో దూకింది. మహిళ మృత దేహం నీటిపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరీలను పరిశీలించగా మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




