AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: నయవంచకుడి ఉచ్చులో చిక్కుకొని యువతి మృతి.. అనాథగా మిగిలిన రెండేళ్ల చిన్నారి!

క్షణికాలపు వ్యామోహంతో తప్పడగులు వేసి ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు మహిళలు. వారి నిర్ణయాలతో తమతో పాటు తమకు పుట్టిన బిడ్డలను సైతం అనాథలుగా మార్చి చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఒక నయ వంచకుడి ఉచ్చులో చిక్కుకొని పచ్చని కాపురాన్ని వీధిన పడేసుకున్న ఓ యువతి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: నయవంచకుడి ఉచ్చులో చిక్కుకొని యువతి మృతి.. అనాథగా మిగిలిన రెండేళ్ల చిన్నారి!
Extramarital Affair
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jul 19, 2025 | 4:52 PM

Share

విజయనగరం జిల్లాలో మణి అనే యువతి అనుమానస్పద మృతి సంచలనంగా మారింది. నెల్లిమర్ల మండలం టోంపలపేటకు చెందిన 24 ఏళ్ల మణికి పూసపాటిరేగ మండలం ఎరుకొండకు చెందిన బుసకల సురేష్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. సురేష్ పెయింట్ వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇద్దరు దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు. నిత్యం కష్టపడి పనిచేసే సురేష్ ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయత్రం ఏడు గంటలకు తిరిగి ఇంటికి వస్తాడు. మణికి ఎలాంటి కష్టం తెలియకుండా జాగ్రత్తగా చూస్తున్నాడు భర్త సురేష్. అయితే వీరి పచ్చని కాపురంలోకి చిచ్చుపెట్టేందుకు అదే గ్రామానికి చెందిన బూర సాయికుమార్ అనే యువకుడు ఎంటర్ అయ్యాడు. ఒకే గ్రామం కావడంతో సాయికుమార్‌తో మణికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో జూన్ పదవ తేదీన సాయికుమార్ సురేష్ ఇంటి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో మణితో కలిసి సరదాగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా సురేష్ తల్లి రావడంతో వారిద్దరు కలిసి ఉండటం చూసి షాక్ అయ్యింది. సురేష్‌ పని నుంచి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అతనికి చెప్పింది.

దీంతో సురేష్‌ ఈ విషయాన్ని మణి తల్లి దృష్టికి తీసుకెళ్లాడు. జరిగిన విషయాన్ని ఆమెకు చెప్పి తన కూతురిని తన దగ్గరే వదిలేసి వచ్చాడు. అలా సురేష్ వద్ద నుండి మణిని తీసుకువచ్చి ఆమె తల్లి.. కూతురుని విజయనగరంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉంటున్న తన అక్కదగ్గర(మని పెద్దమ్మ) ఉంచింది. అలా బిడ్డతో పాటు పెద్దమ్మ ఇంటికి వచ్చిన మణి కొద్ది రోజులు బాగానే ఉంది. తరువాత జూలై 3వ తేదీ తెల్లవారుజామున పెద్దమ్మ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బిడ్డను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంట్లో మణి కనిపించకపోయే సరికి కంగారు పడిపోయిన ఆమె పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మణిని విజయవాడలో సాయికుమార్‌తో ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు మణి, సాయికుమార్‌ను జులై తొమ్మిదవ తేదీన విజయవాడ నుండి విజయనగరం తీసుకువచ్చారు.

మణి, సాయికుమార్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఆమె భర్త సురేష్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ఆ రోజు రావడం కుదరకపోవడంతో మరుసటి రోజు స్టేషన్ కి రావాలని సురేష్ కి చెప్పారు. ఆ తరువాత మణి తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఇంటికి వెళ్లిన మణి 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్నానం కోసమని బాత్రూమ్‌కి వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే స్నానానికి వెళ్లిన మని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా మణి విగతజీవిలా పడి ఉంది. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

అయితే పచ్చని కాపురంలో నిప్పులు పోసిన సాయికుమార్.. మణిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. మహిళలు తస్మాత్ జాగ్రత్త.. మోసగాళ్ల మాయమాటల ఉచ్చులో పడితే జీవితాలే చిన్నాభిన్నం అవుతాయి. బంగారు కుటుంబాలు అల్లకల్లోలం అయ్యే ప్రమాదం ఉంది. క్షణికాలపు ఆనందాలకు నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన జీవితాలు మధ్యలో ఆపేయకండి అంటున్నారు మానసిక వైద్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.