AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆత్మకూర్‌లో అద్భుత దృశ్యం.. వరద నీటిలో మెరిపోతున్న వీటినెప్పుడైనా చూశారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మకూరు పట్టణంలో అద్భుత ఆవిష్కృతమైంది. చిత్తడి వాతావారణ సమయాల్లో విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఎల్లో ఫ్రాగ్స్‌ ఇప్పుడు ఆత్మకూర్‌లో కనువిందు చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన వర్షానికి పట్టణంలో నిలిచిన మీటమడుగుల్లోకి వచ్చిన ఈ పుసుపు రంగు కప్పలు చూపరుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వింతైన శబ్ధాలు చేస్తూ స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటున్నారా.. అయితే చూద్దాం పదండి.

Andhra News: ఆత్మకూర్‌లో అద్భుత దృశ్యం.. వరద నీటిలో మెరిపోతున్న వీటినెప్పుడైనా చూశారా?
Yellow Coloured Frogs
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 19, 2025 | 6:28 PM

Share

ఆత్మకూరు పట్టణంలో పసుపు పచ్చ కప్పలు కనువిందు చేశాయి. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి ఆత్మకూరు పట్టణంలోని కబేల విదిలో ఒక చిన్న కుంటలో 100కు పైగా పసుపు రంగు కప్పలు బేకబికమంటూ శబ్దం చేస్తూ ఉండడంతో అటువైపు వెళుతున్న పట్టణవాసులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండే రంగుకు భిన్నంగా పసుపు రంగులో ఉండడాన్ని ఆశ్చర్యంగా పట్టణ వాసులు తిలకించారు. తమ సెల్ ఫోన్ లలో వాటిని చిత్రీకరించారు. అయితే ఈ పసుపు రంగు కప్పల గురించి వివరంగా తెలుసుకుంటే ఇవి సాధారణంగా మిగతా రోజుల్లో కనపడవని కేవలం వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయని తెలుస్తోంది.

సాధారణంగా ఈ పసుపు రంగు కప్పలను భారత బుల్ ఫ్రాగ్స్ అని పిలుస్తారు. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక , మయన్మార్ వంటి దక్షిణాసియా దేశాలలో విస్తృతంగా కనిపిస్తాయి. రంగు మార్పు సాధారణంగా, (భారత బుల్ ఫ్రాగ్స్) ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ-గోధుమ రంగులో ఉంటాయి. అయితే, వర్షాకాలంలో, ముఖ్యంగా సంతానోత్పత్తి కాలంలో (పొడి వాతావరణం నుండి వర్షాకాలం మారినప్పుడు), మగ కప్పలు ఆడ కప్పలను ఆకర్షించడానికి మరియు తమ ప్రాంతాన్ని గుర్తించడానికి ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మారుతాయి. ఈ పసుపు రంగు చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా కనపడతాయి.

పసుపు రంగు భారత బుల్ ఫ్రాగ్స్ వర్షాకాలం ప్రారంభమైనట్లు మరియు సంతానోత్పత్తి కాలం వచ్చిందని సూచిస్తాయి. ఇవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, కీటకాల జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయి. భారత బుల్ ఫ్రాగ్స్, ఇవి వర్షాకాలంలో తమ రంగును పసుపుగా మార్చుకుని, తమ సహజ ఆవాసాలలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ఇవి భారతదేశంలో కనిపించే అతిపెద్ద కప్పలలో ఒకటి, సుమారు 6.5 అంగుళాల (16.5 సెం.మీ) పొడవు వరకు పెరుగుతాయి. వర్షాకాలంలో ఇవి నీటి గుంటలు, చెరువులు, నదులు, పొలాల వంటి నీటి వనరుల దగ్గర నివసిస్తాయి. ఇవి బురద నీటిలో ఉండటానికి ఇష్టపడతాయి. సంతానోత్పత్తి కాలంలో, మగ కప్పలు పెద్దగా “గర్-ర్-ర్-ర్” అని ధ్వనిస్తాయి, ఇది చాలా దూరం వినిపిస్తుంది. ఈ ధ్వని వాటి గొంతు కింద ఉండే పెద్ద శబ్ద కోశం ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఇది కూడా పసుపు రంగులో ఉంటుంది.ఇవి కీటకాలు, చిన్న సరీసృపాలు, ఎలుకలు మరియు కొన్నిసార్లు చిన్న పక్షులను కూడా తింటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా... యూట్యూబర్ నా అన్వేషణ..
ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా... యూట్యూబర్ నా అన్వేషణ..
మీ రోగాలన్నింటికీ సర్వరోగ నివారణి తిప్ప తీగ కషాయం
మీ రోగాలన్నింటికీ సర్వరోగ నివారణి తిప్ప తీగ కషాయం
ఇలా చేస్తే చాలు.. భోగి రోజు చక్కెర పొంగల్ గుమ గుమలు అదుర్స్!
ఇలా చేస్తే చాలు.. భోగి రోజు చక్కెర పొంగల్ గుమ గుమలు అదుర్స్!