Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ముందడుగు.. రైలు చక్రాల తయారీలో సక్సెస్..!
లోకో వీల్స్ తయారీ కోసం రాయబరేలీ, లాల్ గంజ్‌లో రూ. 1700 కోట్లతో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం పట్టువిడకుండా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే కార్యచరణ మొదలుపెట్టిన ప్రభుత్వం త్వరలోనే ఈప్రక్రియను పూర్తిచేసేందుకు నడుం బిగించింది. అయితే రైలు చక్రాల తయారీలో విశాఖ స్టీల్ ముందడుగు వేసి, విజయవంతం అయింది. తొలివిడతగా 51 లోకో వీల్స్‌ని తయారు చేసి ఇండియన్ రైల్వేకి సరఫరా కూడా చేసింది.
లోకో వీల్స్ తయారీ కోసం రాయబరేలీ, లాల్ గంజ్‌లో రూ. 1700 కోట్లతో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా నిన్న రాత్రి 51 లోకో వీల్స్‌ని ఇండియన్ రైల్వే కి వైజాగ్ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు.
అయిదు దశాబ్దాలకుపైగా వైజాగ్ స్టీల్స్ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంది. ప్రతీ ఏడాది 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును తయారు చేస్తోంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గాను రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతలో వైజాగ్ స్టీల్స్‌ను ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి షాక్ ఇచ్చింది. దశాబ్దాల కిందటే రాష్ట్రంలో వైజాగ్ స్టీల్స్‌ను ప్రైవేట్ పరం చేయోద్దంటూ ఉద్యమాలు సాగాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న విశాక ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం మొండిపట్టు పట్టింది.
Momentous Occasions !#RINL Dispatches first consignment of Forged wheels to Indian Railways. Today First lot of 51 nos Loco wheels was flag- off to Lucknow Workshop, Indian Railways by Director (Commercial & I/c Personnel) & Director(Operation) from #FWP, Lalganj, Raebareli. pic.twitter.com/NlpK6WTihn
— RINL (@RINL_VSP) December 22, 2021
Also Read: Ramineni Awards: నేడు రామినేని పురస్కారాల బహూకరణ.. గెస్ట్‌గా జస్టిస్ ఎన్వీ రమణ.. ఎక్కడంటే..?