Andhra: ఈదురుగాలుల బీభత్సం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో చూశారా..?
విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.. విశాఖలోని చినవాల్తేర్, ఈస్ట్ పాయింట్ కాలనీ.. జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్‌లో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.. దీంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.. ఆయా ప్రాంతాల్లో హోర్డింగ్‌లు సైతం పడిపోయాయి. ఈదురుగాలుల సమయంలోని భయానక దృశ్యాలు.. సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.. విశాఖలోని చినవాల్తేర్, ఈస్ట్ పాయింట్ కాలనీ.. జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్‌లో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.. దీంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.. ఆయా ప్రాంతాల్లో హోర్డింగ్‌లు సైతం పడిపోయాయి. ఈదురుగాలుల సమయంలోని భయానక దృశ్యాలు.. సీసీ ఫుటేజీలోనూ రికార్డయ్యాయి. విశాఖ జీవీఎంసీ ఆఫీసు దగ్గర ఓ భారీ వృక్షం కారుపై పడింది. అటుగా వెళ్తున్న ఓ కారుపై.. భారీ వృక్షం అమాంతం మీద పడిపోయింది. కారులో ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. చుట్టుపక్కల వారు.. కారు దగ్గరకు పరుగెత్తుకెళ్లారు. కారులో ఉన్న వారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. విశాఖలో ఈదురుగాలులు ఏ రేంజ్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి.
పలు ప్రాంతాల్లో పెద్దపెద్ద చెట్లు, కరెంట్ పోల్స్ విరిగిపడడంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్‌కు, కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల బీభత్సంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లు, కరెంట్ పోల్స్ తొలిగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈస్ట్‌పాయింట్ కాలనీలో సోలార్ ఐరన్ పోల్స్ కూలాయి.. చినవాల్తేర్‌లో రోడ్లపై భారీ వృక్షాలు కూలాయి.. దీంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వీడియో చూడండి..
కాగా.. ఇప్పటికే.. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక కొనసాగుతోంది. ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు .. ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతోపాటు.. ఈ మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే.. ఈదురుగాలుల విరుచుకుపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతిభారీ వర్షాలతో పాటు.. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్, భీమిలి RDO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




