Visakhapatnam: మర్డర్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. ఆ ఇద్దరు రౌడీ షీటర్లకు యావజ్జీవం..!
పాత కక్షలకు తోడు విభేదాలు నిండు ప్రాణాన్ని తోడేశాయి. 27 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒకరిని.. ముగ్గురు కలిసి కొట్టి చంపేశారు. అంతా రౌడీషీటర్ లే..! కేసులో వాదోపవాదాలు జరిగాయి. సాక్షాధారలను పరిశీలించిన న్యాయస్థానం, నిందితులపై నేరం రుజువు కావడంతో సంచలన శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివిఆర్ మూర్తి చెప్పిన వివరాల ప్రకారం...

విశాఖపట్నం, మార్చి 5: పాత కక్షలకు తోడు విభేదాలు నిండు ప్రాణాన్ని తోడేశాయి. 27 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒకరిని.. ముగ్గురు కలిసి కొట్టి చంపేశారు. అంతా రౌడీషీటర్ లే..! కేసులో వాదోపవాదాలు జరిగాయి. సాక్షాధారలను పరిశీలించిన న్యాయస్థానం, నిందితులపై నేరం రుజువు కావడంతో సంచలన శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివిఆర్ మూర్తి చెప్పిన వివరాల ప్రకారం…
2017 ఆగస్టు 19న.. సుమారు రాత్రి 9:30 గంటలు. ఆదినారాయణ, శ్రీను, మోహన్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు.. ఆరిలోవ పాండురంగపురం వద్దకు వెళ్లారు. అక్కడ సాడే వినయ్ సంపత్ అనే 27 ఏళ్ల వ్యక్తిని బీర్ బాటల్‌తో దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో సంపత్ కుప్పకూలిపోయి. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అరిలోవ పోలీసులు గృహదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. విచారణ చేపట్టి.. గతంలో జరిగిన గొడవలు కారణంగా ముగ్గురు కలిసి ఉద్దేశ్యపూర్వకంగా సంపత్‌ను హత్య చేసినట్లు గుర్తించి, వారిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే.. ఆ తరువాత కేసు విచారణలో ఉండగా ముగ్గురు నిందితుల్లో ఆదినారాయణ మరణించాడు. మిగిలిన శ్రీను, మోహన్ కుమార్ పై నేరారోపణ రుజువు కావడంతో.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల న్యాయ స్థానం సంచలన తీర్పు చెప్పింది.
యావజ్జీవ శిక్షతోపాటు 2వేల జరిమానా విధించింది న్యాయస్థానం. కేసులో నిందితులకు కన్విక్షన్ పడటంలో ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మూర్తి, కేసు ట్రయిల్ జరడంలో పురోగతి చూపించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ మోహన్ రావు, సిబ్బందిని సిపి రవి శంకర్ అభినందించ్చారు. కోర్టు ట్రైల్స్ నందు విశేష సేవలు అందించినందుకు గాను అభినంధించి.. డి.జి.పి అదేశాలను అనుసరించి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ప్రయారిటీ కేసుల నందు కోర్టులో ట్రయిల్ కు వచ్చి కన్విక్షన్ పడేంత వరకూ ఉన్నతాధికారులు ప్రతీ కేసును కన్విక్షన్ పడే వరకూ పూర్తి మోనటరింగ్ చేయాలని, ప్రతీ ఉన్నతాధికారి 5 కేసులు మోనటరింగ్ చేసే విధముగా అదేశాలు ఇచ్చామనీ ,కేసుల విషయం లో క్రమం తప్పకుండా స్టేషన్ ఇన్స్పెక్టర్ల తో మాట్లాడుతూ ఉండాలని, ఎక్కువ కేసులు గల రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ పై నిరంతరం దృష్టి పెట్టాలని తెలిపారు సిపి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








