AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit 2023: రెండో రోజు ప్రారంభమైన విశాఖ జీ-20 సదస్సు.. నేటి అజెండా ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా నిర్వహిస్తోన్న జీ-20 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. బుధవారం రెండో రోజూ జీ-20 మీట్‌లో భాగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అంశంపై ప్రతినిధులు చర్చించనున్నారు.

G20 Summit 2023: రెండో రోజు ప్రారంభమైన విశాఖ జీ-20 సదస్సు.. నేటి అజెండా ఇదే
G 20 Summit
Basha Shek
|

Updated on: Mar 29, 2023 | 10:51 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా నిర్వహిస్తోన్న జీ-20 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. బుధవారం రెండో రోజూ జీ-20 మీట్‌లో భాగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అంశంపై ప్రతినిధులు చర్చించనున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకతలపై ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సాగర తీరంలో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. అంతకుముందు మంగళవారం రాత్రి జీ-20 సదస్సుకు వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఏర్పాటుచేశారు. సీఎం జగన్‌ అధ్యక్షతన ఈ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు. సాగర నగరం ప్రతి ఒక్కరికీ మధురమైన అనుభూతిని మిగుల్చుతుందన్నారు. జీ-20 ప్రతినిధులకు మర్యాదపూర్వక విందిచ్చిన సీఎం జగన్‌.. వాళ్ల ముందు ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 22లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటూ వివరించారు. ఒక్కోచోట పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని జీ-20 డెలిగేట్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ గృహ సముదాయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం, అందుకు మీ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నట్లు చెప్పారు.

కాగా ఈ సదస్సుకు జీ20 దేశాలతోపాటు యూరోపియన్‌ కంట్రీస్‌కి చెందిన 57మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇవాళ, యోగా, మెడిటేషన్‌, పౌష్టికాహార వినియోగంపై చర్చలు ఉంటాయ్‌, అలాగే మౌలిక సదుపాయాల కల్పనపైనా డిస్కషన్స్‌ చేస్తారు ప్రతనిధులు. రేపు… స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, వేస్టే మేనేజ్‌మెంట్‌ అండ్ ఎనర్జీపై క్షేత్రస్థాయిలో వర్క్‌షాపు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనపై చర్చిస్తారు డెలిగేట్స్‌. సాగర తీరంలో జరుగుతోన్న జీ-20 సదస్సుతో విశాఖకు ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, ఏపీకి పెట్టుబడులు కూడా వస్తాయని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..