AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరంభంలోనే అట్టర్ ఫ్లాప్..! బీజేపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది..?

ఏపీలో ఇక వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన ఉండబోతుందంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. బీజేపీ-జనసేన ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన రెండు పార్టీలు సంయుక్తంగా లాంగ్ మార్చ్‌ చేసేందుకు నిర్ణయానికి వచ్చాయి. అయితే, ఈ లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ప్రకటించారు. ఈ […]

ఆరంభంలోనే అట్టర్ ఫ్లాప్..! బీజేపీ-జనసేన మధ్య ఏం జరుగుతోంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 7:24 PM

Share

ఏపీలో ఇక వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన ఉండబోతుందంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. బీజేపీ-జనసేన ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన రెండు పార్టీలు సంయుక్తంగా లాంగ్ మార్చ్‌ చేసేందుకు నిర్ణయానికి వచ్చాయి. అయితే, ఈ లాంగ్ మార్చ్ వాయిదా పడినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి తురగా నాగభూషణం ప్రకటించారు. ఈ లాంగ్‌మార్చ్ అంశం ప్రస్తుతం వాయిదా వేస్తున్నామని.. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు.

కాగా, ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 2 .00 గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు భారీ కవాతు నిర్వహించేందుకు ఇరు పార్టీలు ప్లాన్ వేశాయి. కానీ ఆరంభంలోనే ఇరు పార్టీలు తీసుకున్న ఈ నిర్ణయం వాయిదా పడటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇటీవల బీజేపీ – జనసేన నేతలు కేంద్రమంత్రులతో పాటుగా.. పార్టీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో పనిచెయ్యాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తీసుకున్న తొలి నిర్ణయమే వాయిదా పడింది. దీనిపై ఇంకా జనసేన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అసలు లాంగ మార్చ్ వాయిదా పడటానికి కారణాలేంటి.. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై బీజేపీ కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో.. అసలు మళ్లీ ఈ మార్చ్ నిర్వహిస్తారా లేక విరమించుకుంటున్నారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి