AFCAT 2026 Registration: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 2 నోటిఫికేషన్ విడుదల.. అవివాహిత యువతీ, యువకులు అర్హులు
భారత వైమానిక దళం (IAF) జులై 2027 నుంచి ప్రారంభమయ్యే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాలలో గ్రూప్ 'ఏ' గెజిటెడ్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత భారతీయ అభ్యర్ధల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 02/ 2026 నోటిఫికేషన్ కింద మొత్తం 379 పోస్టులను భర్తీ చేస్తారు. ఏఎఫ్‌క్యాట్ ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. జూన్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 8న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు
ఫ్లయింగ్ (Flying) పోస్టుల సంఖ్య: 35 (పురుషులు: 30, మహిళలు: 5)
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) పోస్టుల సంఖ్య: 211 పోస్టులు
- ఏరోనాటికల్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ – AE(L) పోస్టుల సంఖ్య: 136
- ఏరోనాటికల్ ఇంజినీర్ మెకానికల్ – AE(M) పోస్టుల సంఖ్య: 75
గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) పోస్టుల సంఖ్య: 107
- వెపన్ సిస్టమ్స్ (WS) పోస్టుల సంఖ్య: పురుషులు 21, మహిళలు 5
- అడ్మినిస్ట్రేషన్ (Adm) పోస్టుల సంఖ్య: పురుషులు 50, మహిళలు 12
- లాజిస్టిక్స్ (Lgs) పోస్టుల సంఖ్య: పురుషులు 4, మహిళలు 2
- అకౌంట్స్ (Accts) పోస్టుల సంఖ్య: పురుషులు 5, మహిళలు 2
- ఎడ్యుకేషన్ (Edn) పోస్టుల సంఖ్య: పురుషులు 1, మహిళలు 2
- మెటియోరాలజీ (Met) పోస్టుల సంఖ్య: పురుషులు 1, మహిళలు 2
GATE స్కోర్ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్) పోస్టులు
- AE(L): పురుషులు 13 (1-PC, 12-SSC), మహిళలు 4 (1-PC, 03-SSC)
- AE(M): పురుషులు 7 (1-PC, 6-SSC), మహిళలు 2 (1-PC, 1-SSC)
ఫ్లయింగ్, వెపన్ సిస్టమ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా గేట్ (GATE) స్కోర్ ఉండాలి. నాన్-టెక్నికల్ విభాగాలకు బ్రాంచ్‌ను బట్టి కామర్స్, అకౌంట్స్ లేదా పీజీ డిగ్రీలు ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా బ్యాక్‌లాగ్‌లు లేకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి ఫ్లయింగ్ బ్రాంచ్‌కు జులై 2027 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 2, 2003 నుంచి జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ ఇండియా జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్)/గేట్ ఎంట్రీ పోస్టులకు 20 నుంచి 26 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వీరు తప్పనిసరిగా జూలై 2, 2001 నుంచి జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.550తోపాటు అదనంగా జీఎస్‌టీ చెల్లించాలి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, గేట్ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజు చెల్లించనవరసం లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, గేట్ స్కోర్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు. ఏఎఫ్‌క్యాట్ పరీక్ష ఆగస్ట్ 8, 2026న ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
ఎంపిక విధానం ఇలా..
ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. తొలుత ఆన్‌లైన్ AFCAT రాత పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (AFSB) పరీక్ష నిర్వహిస్తారు. అక్కడ స్టేజ్ 1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ అండ్ పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, స్టేజ్ 2లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్క్‌లు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు అదనంగా ‘సీపీఎస్‌ఎస్’ పైలట్ పరీక్ష ఉంటుంది.




