AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖపోర్టుకు అరుదైన ఘనత.. వాటి ఎగుమతుల్లో అగ్రస్థానం..

మన విశాఖ పోర్ట్ అన్ని రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఇటీవలనే ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన పోర్టు పని తీరు సూచికలో విశాఖ పోర్టు 20వ స్థానంలో నిలిచింది. అదే విధంగా కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో 19వ స్థానంలో నిలిచి మరో రెండు రికార్డుల్ని నెలకొల్పింది. కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో తనకున్న విశేష అవకాశాల్ని అందిపుచ్చుకుని 2022లో ఉన్న 122వ స్థానం నుంచి ఏకంగా 103 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకుంది.

విశాఖపోర్టుకు అరుదైన ఘనత.. వాటి ఎగుమతుల్లో అగ్రస్థానం..
Visakhapatnam Port
Eswar Chennupalli
| Edited By: Srikar T|

Updated on: Jun 25, 2024 | 9:45 PM

Share

మన విశాఖ పోర్ట్ అన్ని రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఇటీవలనే ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన పోర్టు పని తీరు సూచికలో విశాఖ పోర్టు 20వ స్థానంలో నిలిచింది. అదే విధంగా కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో 19వ స్థానంలో నిలిచి మరో రెండు రికార్డుల్ని నెలకొల్పింది. కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో తనకున్న విశేష అవకాశాల్ని అందిపుచ్చుకుని 2022లో ఉన్న 122వ స్థానం నుంచి ఏకంగా 103 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్న మన విశాఖ పోర్ట్ తాజాగా మరో ఘనతను సాధించింది. 2023–24వ ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో కూడా మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్‌ పోర్టులలో 4వ స్థానంలో నిలిచింది మన విశాఖ పోర్ట్. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో 13.5 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది.

సముద్ర ఉత్పత్తుల రవాణాలో అగ్రగామి..

2023-24 వఆర్థిక సంవత్సరంలో రూ. 17,983.99 కోట్ల రూపాయల విలువ చేసే 3,14,199 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి దేశంలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది విశాఖ పోర్టు. రెండో స్థానంలో రూ. 6,395.70 కోట్ల విలువైన 2,40,253 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు అథారిటీ కొనసాగుతూ ఉండగా రూ. 6,120 కోట్ల విలువైన 1,81,400 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి కొచ్చిన్‌ పోర్టు మూడో స్థానంతో ముందుకు వెళ్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశం లో రూ. 60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి సరికొత్త రికార్డు సృష్టించగా, ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో, విదేశీ డిమాండ్‌లో సవాళ్లు ఎదురైనా అధిగమించి భారత్‌ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. 132 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి తన ప్రతిష్టను పెంచుకుంది ఇండియా.

ఎగుమతులలో రొయ్యలదే ప్రధాన పాత్ర..

సరకు రవాణాలో విశాఖ పోర్టు నంబర్ 1 గా నిలవడం వెనుక ఆంధ్రప్రదేశ్‌లో దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్‌ పరిశ్రమ కృషి ప్రధాన పాత్ర పోషించింది. వనామి రకం రొయ్యలు అధిక ఉత్పత్తి, ఒడిశా సముద్ర ఉత్పత్తులను విశాఖ పోర్టు నుంచి ఎగుమతి చేయడం వంటి అంశాలు విశాఖ పోర్టును ప్రగతిపథంలో నిలపినట్టు పోర్ట్ అథారిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..