AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ స్పీకర్‎కు వైఎస్ జగన్ లేఖ.. పేర్కొన్న అంశాలివే..

శాసన సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. తగినంత సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారని జగన్ లేఖపై అధికార పక్షం వైసీపీని ప్రశ్నించింది. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని.. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు.

అసెంబ్లీ స్పీకర్‎కు వైఎస్ జగన్ లేఖ.. పేర్కొన్న అంశాలివే..
Ys Jagan
Srikar T
|

Updated on: Jun 25, 2024 | 9:56 PM

Share

శాసన సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. తగినంత సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారని జగన్ లేఖపై అధికార పక్షం వైసీపీని ప్రశ్నించింది. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని.. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలని.. కానీ అలా జరగలేదన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించారన్నారని జగన్‌ లేఖలో పేర్కొన్నారు. తనకు ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని కూటమి ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోందని.. ప్రతిపక్ష హోదాకు కనీసం 10శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని జగన్ లేఖలో స్పష్టం చేశారు.

ఎన్డీఏ కూటమి, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారన్న జగన్‌.. వైసీపీ సభ్యులు అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సభలో సమస్యలు వినిపించే అవకాశం ఉందని, ఈ అంశాలను స్పీకర్‌ దృష్టిలో పెట్టుకోవాలని జగన్ కోరారు. ప్రతిపక్ష హోదాకు తగ్గ సంఖ్యా బలం వైసీపీకి లేదని.. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని జగన్ లేఖపై మంత్రి సంధ్యారాణి వైసీపీని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజల్లో ఉండి ఉంటే.. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‎కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ స్పీకర్‎ని గౌరవించలేదని అధికార పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్‌‎పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో తమ్మినేని స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు చంద్రబాబు ఎందుకు ఆయనను గౌరవించలేదని ప్రశ్నించారు. మొత్తానికి ఏపీ శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంఉటందా? లేదా అనే అంశం ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే వర్షాకాల సమావేశాల వరకు వేచి చూడాల్సిందే. అయితే దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు, రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..