AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: విశాఖ రైల్వే స్టేషన్‌లో వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌ ఏర్పాటు.. బొంగులో చికెన్‌తోసహా అన్ని వెరైటీలు ఒకచోటే!

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ పర్యటనకు వచ్చే టూరిస్టులకు అనిర్వచనీయమైన అనుభూతిని, ప్రశాంతతను, వినోదాన్ని అందించగలిగే ప్రదేశం విశాఖ. ఇక్కడ అందమైన బీచ్‌లు, అద్భుతమైన పార్క్‌లు, పచ్చదనం పరచుకున్న ఎత్తైన తూర్పు కనుమలు, లాంటి ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు ఇక్కడి తినుబండారాలు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పరిమితమైన స్థానిక ఆహార రుచులు కూడా టూరిస్టులకు అంతే ప్రత్యేకంగా అనిపిస్తాయి. ప్రధానంగా..

Vizag: విశాఖ రైల్వే స్టేషన్‌లో వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌ ఏర్పాటు.. బొంగులో చికెన్‌తోసహా అన్ని వెరైటీలు ఒకచోటే!
Visakha Food Express Rail Coach
Eswar Chennupalli
| Edited By: Srilakshmi C|

Updated on: Oct 04, 2023 | 9:18 PM

Share

విశాఖ, అక్టోబర్‌ 4: సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ పర్యటనకు వచ్చే టూరిస్టులకు అనిర్వచనీయమైన అనుభూతిని, ప్రశాంతతను, వినోదాన్ని అందించగలిగే ప్రదేశం విశాఖ. ఇక్కడ అందమైన బీచ్‌లు, అద్భుతమైన పార్క్‌లు, పచ్చదనం పరచుకున్న ఎత్తైన తూర్పు కనుమలు, లాంటి ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు ఇక్కడి తినుబండారాలు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పరిమితమైన స్థానిక ఆహార రుచులు కూడా టూరిస్టులకు అంతే ప్రత్యేకంగా అనిపిస్తాయి. ప్రధానంగా విశాఖ లో లభించే సీ ఫుడ్ కు పిచ్చ గిరాకీ. విశాఖ స్టార్ హోటల్స్‌లో లభించే సీ ఫుడ్ ఆహారాన్ని పక్కన పెడితే విశాఖ స్థానిక హోటళ్లలో లభించే అథెంటిక్ ఫుడ్‌కు విపరీతమైన గిరాకీ ఉంటుంది.

అలాంటి విశాఖ అథెంటిక్ ఫుడ్ తినాలంటే ఇకపై విశాఖ నగర వీధుల్లో తిరగక్కర్లేదు. మీరు కానీ విశాఖకు రైల్ లో వచ్చినా, లేదంటే ఏ రకంగా వచ్చినా ఒక్కసారి విశాఖ రైల్వే స్టేషన్ కు వెల్లారంటే చాలు మీకు ట్రైన్ కోచ్ లో నిర్వహిస్తున్న ఒక అందమైన రెస్టారెంట్ మనకు రుచికరమైన ఫుడ్ ను అందిస్తుంది. అరకు బొంగు చికెన్ నుంచి స్టఫడ్ క్రాబ్ వరకు మనకు ఆ విశాఖ కోచ్ ఎక్స్‌ప్రెస్‌లో గంటలూ అందుబాటులో 24 ఉంటాయి

రైల్ కోచ్‌లో.. వైజాగ్ ఫుడ్ ఎక్స్ప్రెస్

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సరికొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతే రైల్వే స్టేషన్‌ ముందున్న బస్టాప్‌ దగ్గర చాలా స్థలం నిరుపయోగంగా ఉంది . అక్కడే వైజాగ్‌ ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఒక రెస్టారెంట్ నిర్మించాలని నిర్ణయించారు. మామూలు కాంక్రీట్ నిర్మాణం కాకుండా పాడైపోయిన ‘కోచ్‌’ ను ఆధునీకరించి ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే అందరినీ ఆకట్టుకుంటుందని భావించారు. అంతే వేగంగా ఒక పాత రైలు కోచ్‌ను తీసుకువచ్చి, రెస్టారెంట్‌గా తీర్చిదిద్దారు. అందంగా తయారుచేశారు. ఇటీవల కాలంలో అందరినీ ఆకట్టుకుంటున్న మండీ రెస్టారెంట్ టైప్‌లో మరొకదాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రతి రోజూ 24 గంటలు అందుబాటులో రెస్టారెంట్..

ఈ కోచ్ రెస్టారెంట్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అటు ప్రయాణీకులతో పాటు ఇటు నగర వాసులకూ ఇప్పుడు అదొక సరికొత్త డెస్టినేషన్. అర్థరాత్రి తర్వాత ఫుడ్ తినాలంటే నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్తే సరి.. కోచ్ రెస్టారెంట్ లో మనకు ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ రెస్టారెంట్ 24/7 పనిచేస్తుంది. మనం ఎప్పుడు వెళ్ళినా వేడివేడి ఆహార పదార్థాలను సరఫరా చేస్తారు . ఈ కోచ్ ను నిర్మించింది రైల్వే శాఖ అయినా నిర్వహణ బాధ్యతలను మాత్రం ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించారు. పాత కోచ్ కు 15 లక్షల రూపాయలు వెచ్చించి తయారు చేసిన ఈ రెస్టారెంట్ కు ఏడాదికి 72 లక్షలు లైసెన్స్‌ ఫీజు నిర్ణయించారు. ఈ రెస్టారెంట్లు ను రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన విక్రమ్‌ జర్దోష్‌ చేతులు మీదుగా ప్రారంభింప చేయడం విశేషం

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.