AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిలో రాములమ్మ.. ఎన్నో ఏళ్లుగా ఆమె కుటుంబం నివసించేది అక్కడే.. ఎందుకో తెలుసా..

మధ్యలో ఒకే ఒక్క నివాస గృహం.. ఇప్పటి ఆధునిక యుగంలో మనలాంటి వాళ్ళు ఉండాలంటే ఏదో వెకేషన్‌కు వెళితే మహా అయితే వీకెండ్స్‌ ఎంజాయ్‌ చేస్తామేమో.. కానీ ఆ కుటుంబం వందల ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నామన్న భావనతో అడవి తల్లి పొత్తిళ్ళలోనే ఉంటోంది. తమ తాత ముత్తాతల కాలం నుంచి ఆ కుటుంబం ఆ అడవి తల్లినే నమ్ముకొని జనావాసాలకు దూరంగా జీవిస్తోంది. ఇంతకు అడవి లో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది.

అడవిలో రాములమ్మ.. ఎన్నో ఏళ్లుగా ఆమె కుటుంబం నివసించేది అక్కడే.. ఎందుకో తెలుసా..
Ramulamma
Follow us
Fairoz Baig

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 04, 2023 | 11:02 PM

ప్రకాశంజిల్లా, అక్టోబర్ 04: చుట్టూ అడవి, నరసంచారం లేని ప్రాంతం.. మధ్యలో ఒకే ఒక్క నివాస గృహం.. ఇప్పటి ఆధునిక యుగంలో మనలాంటి వాళ్ళు ఉండాలంటే ఏదో వెకేషన్‌కు వెళితే మహా అయితే వీకెండ్స్‌ ఎంజాయ్‌ చేస్తామేమో.. కానీ ఆ కుటుంబం వందల ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నామన్న భావనతో అడవి తల్లి పొత్తిళ్ళలోనే ఉంటోంది. తమ తాత ముత్తాతల కాలం నుంచి ఆ కుటుంబం ఆ అడవి తల్లినే నమ్ముకొని జనావాసాలకు దూరంగా జీవిస్తోంది. ఇంతకు అడవి లో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది.

ప్రకాశంజిల్లా కొమరోలు మండలం అల్లినగరం పంచాయతీలో గల మాధవ గ్రామ ఉంది.. ఈ గ్రామం అడవి మధ్యలో ఉంటుంది. అటవీ సంపదను నమ్ముకుని ఇక్కడి కుటుంబాలు జీవిస్తుండేవి.. గతంలో ఈ గ్రామంలో చాలా కుటుంబాలు ఉండేవి. అయితే మారుతునర్న కాలానికి అనుగుణంగా అందరూ ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయారు. అయితే ఇప్పటికీ ఆ మదవ గ్రామంలోనే నివసిస్తోంది ఈ ఒకే ఒక్క కుటుంబం మాత్రమే.

అడవిలోని రామక్క కుటుంబం..

ఆ కుటుంబ పెద్ద రామక్క. ఈ అడవిలోని రామక్క కుటుంబం ఇప్పటికీ నివసిస్తోంది. కొమరోలు మండలం అల్లినగరం పంచాయతీ ఎర్రగుంట్ల గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. అటివి ప్రాంతం నుండి సుమారు 10 కిలోమీటర్ల మేర మాధవ గ్రామానికి రహదారి ఉంది. రహదారి అంటే బస్సులు, కార్లు ప్రయాణించే రహదారి కాదు… కేవలం కాలి బాట మాత్రమే ఈ గ్రామానికి వెళ్ళేందుకు ఏకైక మార్గం… ఈ గ్రామానికి చేరాలంటే దట్టమైన అడవిలో వ్యయ ప్రయాసలకు ఓర్చి, నడవాల్సి ఉంటుంది… అటువంటి అటవీ ప్రాంతంలోని మాధవ గ్రామంలో నివసించేది కేవలం ఒకే ఒక్క కుటుంబం మాత్రమే. చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలో మాధవ నాయుడు నివసించేవారు.

వందేళ్లుగా ఈ అడవిలోనే..

ఇక అప్పట్లో అడవి తల్లిని నమ్ముకుని వారు జీవనాన్ని సాగించేవారు. అదే కుటుంబం సుమారు వందేళ్లుగా ఈ అడవినే నమ్ముకుని నేటికి సైతం జీవనం సాగిస్తున్నారు. ఈ మాధవ గ్రామానికి సమీపంలో శ్రీమాధవ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండడంతో, వారి కుటుంబీకులు స్వామివారికి నైవేద్యం సమర్పించుకుంటూ ఇక్కడే జీవనాన్ని సాగిస్తున్నారు. చుట్టూ అడవి… సెల్ ఫోన్ సిగ్నల్స్ సైతం లేని ప్రాంతమిది. అయితే ప్రస్తుతం ఈ అడవిలో రామక్క కుటుంబీకులు మాత్రమే నివసిస్తున్నారు. వీరి నివాస గృహం వద్ద మంచి నీటి బావి నీటిని త్రాగి జీవనాన్ని కొనసాగిస్తుంటామని రామక్క చెబుతున్నారు.

చీకటి పడిందంటే చాలు..

అవసరాలను బట్టి తాము వారానికి ఒకసారి నగరానికి వెళ్లి సరుకులను తెచ్చుకుంటామని, తమకు పశుపోషణ సైతం ఇక్కడ జీవనాధారంగా జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు రామక్క కుమారుడు తెలిపారు. కాగా అడవిలో చీకటి పడిందంటే చాలు తాము సైతం అంధకారంలో జీవనం సాగించాల్సి వస్తుందని, సోలార్ లైట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు… జనావాసాలకు దూరంగా జీవిస్తున్నా శ్రీమాధవ రామలింగేశ్వర స్వామి సేవలో తరిస్తూ, ఓవైపు పశుపోషణ జీవనాధారంగా అడవిలో జీవన మనుగడ సాగిస్తున్న రామక్క కుటుంబం ధైర్యాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం