AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: తెలంగాణలో ఓట్ల కోసం కొందరు ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారు: బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య ప్రతి రోజు విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇక తాజాగా బాలకృష్ణ తెలంగాణ రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం మూడు రోజులుగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు.

Balakrishna: తెలంగాణలో ఓట్ల కోసం కొందరు ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారు: బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
Mla Balakrishna
Subhash Goud
|

Updated on: Oct 04, 2023 | 8:46 PM

Share

ఏపీ, తెలంగాణలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య ప్రతి రోజు విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇక తాజాగా బాలకృష్ణ తెలంగాణ రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం మూడు రోజులుగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్ పై కొందరు వెంటనే స్పందించ లేదని పరోక్షంగా బీఆర్ఎస్ పై బాలకృష్ణ విమర్శలు చేశారు. తెలంగాణ రాజకీయ నేతలు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించినా, ఎన్టీఆర్ జపం చేసినా ఎటువంటి లాభం లేదని బాలకృష్ణ అన్నారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తాను అండగా ఉంటానని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్‌ చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్‌పై సినీ పరిశ్రమ స్పందించకపోవడంపైనా బాలయ్య మాట్లాడారు. ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఐ డోంట్‌ కేర్‌ అన్నారు. కాగా, ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రోజుకో విధంగా రాజకీయ మలుపులు తిరుగుతోంది.

వైఎస్‌ఆర్‌ సీపీ వల్లే చంద్రబాబు అరెస్టు అయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని నేతలు వైసీపీపై మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం తర్వాత వైసీపీ, టీడీపీ నేతల మధ్య రోజు మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఏ తప్పుడు చేయలేదని, కావాలని కేసుల్లో ఇరికించేందుకు కేసులు నమోదు చేస్తున్నారని ఆక్రోశం టీడీపీ నేతలు వెల్లగక్కుతున్నారు. ఎన్ని కేసులు బనాయించినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా ఏ మాత్రం భయపడేది లేదని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేస్తున్నారు.

ఏ తప్పు చేయని చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అటు చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని, తమ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని అంటున్నారు. ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతామని పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి