AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదో వింత దొంగతనం.. దోచుకోవడానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్లలేక ఏం చేశారంటే..

చెడు వ్యసనాలకులోనై కొందరు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరికొందరు ఇలా రకరకాల కారణాల చేత దొంగతనాలకు పాల్పడుతుంటారు. గతంలో దొంగలు తమని దొంగలని గుర్తించాలనే విధంగా బారు మీసాలు, గళ్ళలుంగీ ఇలా డ్రెస్ కోడ్ మైంటైన్ చేసేవారు.

Viral Video: ఇదో వింత దొంగతనం.. దోచుకోవడానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్లలేక ఏం చేశారంటే..
Funny Behavior Of Teens
B Ravi Kumar
| Edited By: Srikar T|

Updated on: Mar 26, 2024 | 4:40 PM

Share

ఏలూరు, మార్చి 26: చెడు వ్యసనాలకులోనై కొందరు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మరికొందరు ఇలా రకరకాల కారణాల చేత దొంగతనాలకు పాల్పడుతుంటారు. గతంలో దొంగలు తమని దొంగలని గుర్తించాలనే విధంగా బారు మీసాలు, గళ్ళలుంగీ ఇలా డ్రెస్ కోడ్ మైంటైన్ చేసేవారు. అయితే ఇప్పుడు కూడా చెడ్డి గ్యాంగ్ నిక్కర్లు తొడుక్కుని తమ ఉనికి తెలిసేలా దొంగతనాలు చేస్తున్నారు. మరికొందరు దొంగలు అయితే జనాల్లోనే తిరుగుతూ దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఇప్పుడెందుకు ఈ దొంగలు దొంగతనాల గోల అని అనుకుంటున్నారా.. షాపులో దొంగతనం జరిగిన విషయాన్ని గురించి తెలుసుకున్న స్థానికులు ముందుగా షాక్ అయ్యారు. ఆ తరువాత విషయం తెలుసుకుని కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. షాపులో దొంగతనం జరిగితే భయపడాలి కానీ నవ్వుకోవడమేంటనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్న.. వారు షాపులో దొంగతనం చేసిన వస్తువులు గురించి మీకు తెలుసుకుంటే నవ్వాపుకోలేరు మరి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో సత్యనారాయణ అని వ్యక్తి మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్ నడుపుతున్నారు. ప్రతిరోజు లాగానే రాత్రి తొమ్మిది దాటాక షాప్‎కి తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లి పోయారు. అయితే ముగ్గురు దొంగలు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో సత్యనారాయణ మెడికల్ షాప్ వద్దకు వచ్చారు. మెడికల్ షాప్‎కు చెక్క తలుపులు వేసి దానికి లాక్ చేసి ఉండడంతో తమతో తెచ్చుకున్న ఇనుపరాడుతో తాళాన్ని పగలగొట్టి తలుపులు తీసి ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు. అందులో ఒక దొంగ నేరుగా కౌంటర్లో కూర్చుని క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి అందులో నగదు కోసం వెతుకులాట ప్రారంభించాడు. అయితే క్యాష్ కౌంటర్లో ఒక్క రూపాయల నోటు కూడా లేకపోవడంతో షాక్కు గురయ్యాడు. క్యాష్ కౌంటర్ల గిన్నెల్లో 20 నుంచి 30 వరకు కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. మరో దొంగ బాక్సుల్లో ఎక్కడైనా నగదు దాచారేమోనని అన్ని వెతకడం ప్రారంభించాడు. ఎక్కడ వెతికిన వారికి ఒక్క నోటు కూడా కనిపించలేదు. చివరకు ఇద్దరు చేసేదిలేక బయటికి వెళ్ళిపోయారు.

అయితే దొంగతనానికి వచ్చి వట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుందనుకున్నారో ఏమో తెలియదు గానీ మళ్లీ ఓ దొంగ షాపులోకి తిరిగి వచ్చి క్యాష్ కౌంటర్లో రూపాయి కాయిన్స్‎తో ఉన్న గిన్నెను, సర్ఫ్ ప్యాకెట్లను తీసుకువెళ్లాడు. ఇక మరో దొంగ వచ్చి నవరతన్ ఆయిల్ ప్యాకెట్ల కవర్ను తీసుకువెళ్లాడు. అలా హడావిడిగా దొంగతనం చేసి బండిమీద కొంచెం దూరం వెళ్ళాక మొదట షాపు తాళం పగలకొట్టడానికి ఉపయోగించిన రాడ్డుని షాపులో మర్చిపోయామని తెలుసుకుని వెనుకకు తిరిగి వచ్చి కౌంటర్‎పై పెట్టిన ఆ రార్డుని సైతం తీసుకుని ఎంచక్కా అక్కడినుంచి బైక్పై పారిపోయాయి. అయితే వారు దొంగతనం చేసిన దృశ్యాలన్నీ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాంతో వారి దొంగతనం దృశ్యాలు చూసిన స్థానికులు కడుపుబ్బా నవ్వుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..