Watch Video: వామ్మో.. రెప్పపాటులో..! సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరినీ అతికష్టం మీద..
ఆరుగురు స్నేహితులు.. అంతా ఇంటర్ చదువుతున్నారు. ఎగ్జామ్స్ అయిపోయాయి. హోళీ కావడంతో సరదాగా విహారానికి వెళ్లాలనుకున్నారు. ఆర్కే బీచ్ స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరారు.
ఆరుగురు స్నేహితులు.. అంతా ఇంటర్ చదువుతున్నారు. ఎగ్జామ్స్ అయిపోయాయి. హోళీ కావడంతో సరదాగా విహారానికి వెళ్లాలనుకున్నారు. ఆర్కే బీచ్ స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరారు. కొందరు నీటిలో దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో ఓ భారీ అల వచ్చింది. ఇద్దరిని లాక్కెల్లి పోతోంది. కళ్ళముందే స్నేహితులను కెరటాలు లోపలికి అమాంతంగా లాక్కెల్లి పోతున్నాయి. అయినా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సహాయం కోసం కేకలు వేశారు. ఇంతలో లైఫ్ గార్డ్స్ తమ ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు. హోళీ సందర్భంగా సరదాగా స్నేహితులతో విహారానికి వెళ్లిన ఇద్దరు యువకులు ఆర్కే బీచ్లో గల్లంతయారు. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్.. హుటాహుటిన సముద్రంలోకి వెళ్లారు. కెరటాల్లో కొట్టుకుపోతున్న కౌశిక్, బషీర్ అనే యువకులను అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఉప్పునీరు తాగి అప్పటికే ఆపస్మారక స్థితికి చేరుకున్న యువకులను సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో లైఫ్ గార్డ్స్ను అంతా అభినందించ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

