Watch Video: ఇదేం భక్తిరా బాబు.. శూలాలు గుచ్చుకుంటూ.. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు..

హరోం హర హర అంటూ నామస్మరణలు చేస్తూ పదునైన ఇనుప కొక్కిలు, అస్త్రాలు, వీపుకు, బుగ్గలకు కుచ్చుకొని తమిళులు తమ భక్తికి చాటుకుంటున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ సుబ్రమణ్య స్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగగా, వైభవంగా నిర్వహించారు.

Watch Video: ఇదేం భక్తిరా బాబు.. శూలాలు గుచ్చుకుంటూ.. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు..
Emmiganuru
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 26, 2024 | 3:54 PM

హరోం హర హర అంటూ నామస్మరణలు చేస్తూ పదునైన ఇనుప కొక్కిలు, అస్త్రాలు, వీపుకు, బుగ్గలకు గుచ్చుకొని తమిళులు తమ భక్తికి చాటుకుంటున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ సుబ్రమణ్య స్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగగా, వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తమిళుల ఆరాధ్యదైవం అయిన శ్రీ సుబ్రమణ్యం స్వామి జయంతి సందర్భంగా వైభవంగా స్వామి రథోత్సవం నిర్వహించారు. పట్టణంలోని పాత ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉదయం నుండే జమ్మి వృక్షంకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే బుగ్గలకు, విపుకు పదునైన ఇనుప చువ్వలు గుచ్చుకొని హరోం హర.. ఓం నమశివాయ అంటూ స్మరించుకున్నారు.

పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. చూసే వారికి ఒళ్ళు గగ్గుర్లు పుట్టెల మహిళలు, పిల్లలు సైతం శూలాలు కుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. అలా రథోత్సవంలో గుచ్చుకొవడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయి అని వారి నమ్మకం. కానీ ఆ శూలాలు గుచ్చేటప్పుడు రక్తం బొట్టు కూడా బయటకు రాకపోవడం ఇక్కడ విశేషం. శూలాలు గుచ్చుకున్నా వారికి నొప్పి తెలియకుండా స్వామి వారి విభూతి పూసుకుంటారు. రథోత్సవంలో కోవళిలతో చేసిన నృత్యాలు అందరిని అక్కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…