Guntur: కార్లో వచ్చి దర్జాగా ఫ్లాట్‌లోకి వెళ్లాడు.. అంతే హుందాగా కిందకి వచ్చాడు.. కట్ చేస్తే..

కారులో అపార్ట్ మెంట్ కు వచ్చిన వ్యక్తి ప్లాట్ వద్దకు వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో పదహారు సవర్ల బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా సర్ధుకొని తీసుకెళ్లాడు. అయితే వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఎవరూ లేరని ముందే సమాచారం ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Guntur: కార్లో వచ్చి దర్జాగా ఫ్లాట్‌లోకి వెళ్లాడు.. అంతే హుందాగా కిందకి వచ్చాడు.. కట్ చేస్తే..
Thief
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 26, 2024 | 12:51 PM

అది గుంటూరులోని శ్రీనివాసరావు పేట… ఎన్ ఎల్ ఆర్ అపార్ట్ మెంట్… మధ్యాహ్న సమయం…. ఒక కారు నేరుగా వచ్చి అపార్ట్ మెంట్ పార్కింగ్ వద్ద ఆగింది. అందులో నుండి టిప్ టాప్‌గా రెడి అయిన వ్యక్తి దిగాడు. నేరుగా లిఫ్ట్ లో పై అంతస్థుకి వెళ్లాడు. అతడి హుందాతనం చూసి ఎవరికీ ఎలాంటి డౌట్ రాలేదు. కొద్ది సేపటి తర్వాత ప్లాట్ నుండి కిందకు దిగి…. వచ్చిన కారులోనే అంతే దర్జాగా వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ప్లాట్ తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి యజమానలుకు చెప్పగా ఇంట్లో పదహారు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు మాయమైనట్లు గుర్తించారు. వచ్చిన వ్యక్తి యజమాని కాదు దొంగ అన్న అనుమానం బలపడింది.

ఈ విషయాన్ని యజమాని పోలీసులకు చెప్పాడు. దీంతో వచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా ఇప్పటివరకూ ఎటువంటి ఆనవాళ్లు సేకరించలేకపోయారు. అయితే అపార్ట్ మెంట్ సిసి కెమెరా విజువల్స్ పరిశీలించగా వచ్చిన వ్యక్తే దొంగ అని రూడీ అయింది. గతంలోనూ కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిలా వచ్చి ఇంటి తాళాలు పగుల గొట్టి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ఘటన పోలీసులకు గుర్తుకొచ్చింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

కారులో అపార్ట్ మెంట్ కు వచ్చిన వ్యక్తి ప్లాట్ వద్దకు వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో పదహారు సవర్ల బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా సర్ధుకొని తీసుకెళ్లాడు. అయితే వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఎవరూ లేరని ముందే సమాచారం ఉందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో ఇటువంటి తరహా దొంగతనాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఇంటిలో ఎవరూ లేకుండా ఊర్లకు వెళ్లినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులు ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తం మీద సంచలనం రేపిన పట్టపగలు చోరి కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…