Mutton Mafia: మటన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇది తెలిస్తే ముక్క ముట్టరు..! బాబోయ్ ఇంత దారుణమా..?

అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ మటన్‌ వ్యాపారుల్లో మాత్రం అదే నిర్లక్ష్యం వహిస్తూ... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. తాజాగా మరోమారు..

Mutton Mafia: మటన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇది తెలిస్తే ముక్క ముట్టరు..! బాబోయ్ ఇంత దారుణమా..?
Mutton Mafia
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:52 AM

Mutton Mafia: మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది మటన్‌.. ప్రస్తుతం ఈ మటన్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు కిలో 500లోపు ఉండే మటన్‌ ఇప్పుడు వెయ్యికి చేరువైంది. కరోనా కష్టకాలం నుంచే నాన్ వెజ్‌కు డిమాండ్‌ పెరిగింది. దాంతో పాటే ధరకూడా అమాంతంగా పెరిగిపోయింది. మాంసం ఎక్కువగా తింటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందడంతో పాటుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలియటంతో జనాలు ఎగబడుతున్నారు. అందుకే మటన్ కు గిరాకీ పెరిగింది. ఇక ప్రజల డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న కొందరు వ్యాపారులు.. ముఖ్యంగా ఏపీలోని బెజవాడలో మటన్‌ మాఫీ ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ మటన్‌ వ్యాపారుల్లో మాత్రం అదే నిర్లక్ష్యం వహిస్తూ… ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. తాజాగా మరోమారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారులు దాడులు నిర్వహించగా షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారులు స్థానికంగా ఉన్న పలు మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. కృష్ణలంక రాణిగారి తోటలో విఎంసి వెటర్నరీ డాక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు..ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్న వారిపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేయగా.. భారీగా కుళ్లిన మాంసం నిల్వలు గుర్తించారు అధికారులు. కొన్నిరోజుల నుంచి కృష్ణలంకలోని భూపేష్ నగర్ లో రాము అనే వ్యాపారి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల మాంసాన్ని విక్రయిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆయా దుకాణం పై అధికారులు దాడులు చేశారు. నిల్వ చేసిన మాంసంతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.

అతని ఇంట్లో ఏకంగా 100 కేజీల కుళ్లిన మాంసంతో పాటు తలలు, కాళ్లు ఫ్రిజ్ లో నిల్వ ఉంచాడు. చనిపోయిన గొర్రెలను తీసుకొచ్చి, ఇంట్లోనే వాటిని కోసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తాడని చెప్పారు. ఆ మాంసం బాగా దుర్వాసన వెదజల్లుతోంది. వీఎంసీ అధికారులు ఆ మాంసాన్ని సీజ్ చేశారు. గతంలో కూడా రాము ఇలానే కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ఐస్ బాక్స్ లో నిల్వపెట్టి విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు…అంతేకాకుండా కొంత మాంసాన్ని హోల్ సేల్ ధరలతో షాపులకు కూడా అమ్ముతున్నాడని వెల్లడించారు. ఇలాంటి మాంసం తింటే అనేక రోగాలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. కుళ్లిన మాంసంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారిపై అధికారులు కేసు నమోదు చేశారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి