AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అదృష్టవంతుడు..! టూవీలర్‌ నుంచి ఫోర్‌ వీలర్‌కి ఇట్టే ఎగిరిపడ్డాడు.. జాతకంలో రాసుందంటే ఇదేనేమో మరి..

మీరు అతి త్వరలో ద్విచక్ర వాహనం నుండి నాలుగు చక్రాల వాహనంలోకి మారుతారు అని జాతకంలో రాసుందంటే..ఇదేనేమో మరీ..అంటూ ఈ వీడియోకి ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చారు.

Viral Video: అదృష్టవంతుడు..! టూవీలర్‌ నుంచి ఫోర్‌ వీలర్‌కి ఇట్టే ఎగిరిపడ్డాడు.. జాతకంలో రాసుందంటే ఇదేనేమో మరి..
Biker
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2022 | 8:09 AM

Share

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే సమయంలో డ్రైవర్, బైక్ నడిపే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని..లేదంటే రెప్పపాటులో ఘోర ప్రమాదం జరిగే అవకాశం తప్పదు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అనేక కారణాలతో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు మంచానికే పరిమితమయ్యే ఘటనలు అనేకం చూస్తుంటాం..ఇంకొందరికీ అదృష్టం బాగుంటే మరణం అంచులదాకా వెళ్లి తిరిగి వస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

బైక్‌ చేతిలో ఉంటే చాలు చాలా మంది అతివేగంతో దూసుకుపోతుంటారు. మితిమీరిన స్పీడ్‌తో రోడ్డుపై రయ్‌మంటూ చెలరేగిపోతుంటారు. అలాంటి వారి వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తితో పాటు, చుట్టుపక్కల వాహనదారులు, ప్రయాణికులు సైతం ప్రమాదంలో పడాల్సి వుస్తుంది. ఇంకొన్ని సార్లు అతడు ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ ఎదుటి వారిని ప్రమాదంలో పడేస్తుంటారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చూడండి.. ఓ వ్యక్తి వేగంగా బైక్ పై వచ్చి ముందు పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. అయితే ఆ వ్యక్తి అదృష్టం బాగుంది.. ఎలాంటి ప్రమాదం గానీ, ఏ చిన్నపాటి గాయాలు గానీ తగలకుండా..అమాంతం ఎగిరి గంతేసి కారు రూఫ్ పై పడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను Twitter @NitinArchitect అనే ఖాతాలో షేర్‌ చేయబడింది.’మీరు అతి త్వరలో ద్విచక్ర వాహనం నుండి నాలుగు చక్రాల వాహనంలోకి మారుతారు అని జాతకంలో రాసుందంటే..ఇదేనేమో మరీ..అంటూ ఈ వీడియోకి ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇకపోతే, ఈ వార్త రాసే సమయానికి ఈ వీడియోకు దాదాపుగా 4 లక్షల వరకు వ్యూస్‌ వచ్చాయి. దీనితో పాటు, ప్రజలు వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..