దారుణం.. భూ వివాదంలో గిరిజన మహిళకు నిప్పుపెట్టిన దుండగులు..

ప్ర‌భుత్వం బాధిత మ‌హిళ‌కు ఇచ్చిన భూమిని కొంద‌రు ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేశారు. వివాదాస్ప‌ద భూమి వ‌ద్దే ఆ మ‌హిళ‌కు నిప్పు అంటించి ముగ్గురు వ్య‌క్తులు వీడియో తీశారు.

దారుణం.. భూ వివాదంలో గిరిజన మహిళకు నిప్పుపెట్టిన దుండగులు..
Fire
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 04, 2022 | 2:36 PM

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 38 ఏళ్ల మ‌హిళ‌కు నిప్పు అంటించారు కొందరు వ్యక్తులు. భూ వివాదం విష‌యంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదంతో బాధిత మ‌హిళ‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేశారు. ఈ ఘటన గుణ జిల్లాకు చెందినదిగా తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని రాంప్యారి సహారియాగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్ర‌భుత్వం బాధిత మ‌హిళ‌కు ఇచ్చిన భూమిని కొంద‌రు ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేశారు. వివాదాస్ప‌ద భూమి వ‌ద్దే ఆ మ‌హిళ‌కు నిప్పు అంటించి ముగ్గురు వ్య‌క్తులు వీడియో తీశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో షేర్ అవుతోంది. గుణ జిల్లాలోని రామ్‌ప్యారీ ష‌హ‌రియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కాలిన గాయాల‌తో రోదిస్తున్న భార్య‌ను త‌న భూమిలో చూసిన‌ట్లు ఆమె భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న భార్య‌ను స‌జీవంగా ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించిన వాళ్లు ఓబీసీ వ‌ర్గానికి చెందిన‌ట్లు భ‌ర్త త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల