AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Hundi Income: తిరుమల చరిత్రలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఆదివారం ఒక్కరోజే భారీగా..

స్వామి వారి దర్శనం కోసం భక్తులు 4 కిలోమీటర్ల పొడవు క్యూలో వేచి ఉండగా.. తిరుమలలోని వసతి కౌంటర్లలో కూడా ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిచ్చాయి. అటు

TTD Hundi Income: తిరుమల చరిత్రలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఆదివారం ఒక్కరోజే భారీగా..
Ttd Hundi Income
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jul 05, 2022 | 11:52 AM

Share

దాదాపుగా అన్ని పరీక్షల ఫలితాలు, తిరిగి విద్యాసంస్థల ప్రారంభంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారికి ఆదివారం ఒక్కరోజులోనే భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు రికార్డు సృష్టించాయి. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఆదివారం ఒక్క‌రోజే ఏకంగా రూ.6 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం ల‌భించింది. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆదివారం విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఈ హుండీ ఆదాయం 2012 ఏప్రిల్ 1న ల‌భించింది.

ఇదిలా ఉంటే, శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 4 కిలోమీటర్ల పొడవు క్యూలో వేచి ఉండగా.. తిరుమలలోని వసతి కౌంటర్లలో కూడా ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిచ్చాయి. అటు ఏపీలోనూ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత రెండు రోజులుగా యాత్రికుల రద్దీ పెరిగింది. దీంతో వసతి, ఇతర సౌకర్యాలు పరిమితికి మించి విస్తరించాయి. తిరుమలలోని అన్ని వసతి కౌంటర్ల వద్ద టీటీడీ అధికారులు ఉదయాన్నే ‘నో వేకెన్సీ’ బోర్డులను పెట్టారు. రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై జూలై 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!